Wedding Gifts: శ్రీవారి ప్రసాదాలుగా చంద్రగిరిలోని కొత్తజంటలకు పెళ్లికానుక.. తాళిబొట్టు, పట్టుబట్టలు, మెట్టెలు..

Wedding Gifts: చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వివాహం చేసుకునే జంటలకు ఉచితంగా బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు, మెట్టెలు, తిరుమల శ్రీవారి ప్రసాదాలు కానుకగా అందించే కార్యక్రమం ఘనంగా..

Wedding Gifts: శ్రీవారి ప్రసాదాలుగా చంద్రగిరిలోని కొత్తజంటలకు పెళ్లికానుక.. తాళిబొట్టు, పట్టుబట్టలు, మెట్టెలు..
Gift Free Gold Thali
Follow us

|

Updated on: Sep 15, 2021 | 9:14 AM

Wedding Gifts: చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వివాహం చేసుకునే జంటలకు ఉచితంగా బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు, మెట్టెలు, తిరుమల శ్రీవారి ప్రసాదాలు కానుకగా అందించే కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.  వివాహం చేసుకోబోతున్న 7 జంటలకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ కానుకలు అందించి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరి శాసనసభ్యులు, తుడా చైర్మన్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత నిధులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నియోజక వర్గానికి చెందినవారు ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఈ కానుక అందించే కార్యక్రమం శాశ్వతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 12 ఏళ్లుగా తుమ్మల గుంట లోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకునే జంటలకు ఈ కానుకలు ఇసున్నారని ఆయన చెప్పారు. ఇకపై చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వధువు లేదా వరుడు ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఈ కానుక లన్నీ అందజేసే కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైందని శ్రీ సుబ్బా రెడ్డి చెప్పారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.

శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..  12 ఏళ్ల క్రితం దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా తుమ్మలగుంట లో వివాహం చేసుకునే జంటలకు బంగారు తాళిబొట్టు, మెట్టెలు, పట్టుబట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇకపై నియోజకవర్గానికి చెందిన వారు ఎక్కడ వివాహం చేసుకున్న ఈ కానుకలు అందజేస్తామని తెలిపారు.

మరోవైపు తెలుగు లోగిళ్లలో పెళ్లి శుభకార్యాలు జరుపుకునే సమయంలో విఘ్నేశ్వరుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు. ఇక వివాహం జరిగే ఇంట్లోని మొదటి శుభలేఖ దేవుడి గుడిలో దేవుని పాదాల చెంత పెట్టి పూజించి అప్పుడు బంధువులకు, స్నేహితులకు పంచడం మొదలు పెడతారు. అయితే చాలా మంది కలియుగదైవం తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని భావిస్తారు.తిరుపతికి దగ్గర వారైతే.. స్వయంగా పెండ్లి శుభలేఖ ను ఇస్తారు. మరి దూరపు భక్తులపై స్వామివారికి శుభలేఖను ఎలా పంపించేలా అని ఆలోచిస్తారు.. ఎవరైనా తెలిసిన భక్తులు తిరుమల వెళ్తే.. వారి చేతికి ఇస్తారు.. అటువంటి అవకాశం లేని భక్తులు కూడా స్వామివారికి వివాహ ఆహ్వాన పత్రిక పంపవచ్చు ఏది ఎలా అంటే..

మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపించవచ్చు వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలుపుతారు)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది..

తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్ చేయాల్సిన అడ్రస్ ఏమిటంటే..

To, Sri Lord Venkateswara swamy, The Executive Officer TTD Administrative Building K.T.Road Tirupati

Also Read:

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి