Irumudi Bags: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే మన్నికైన ఇరుముడి బ్యాగ్స్ .. ఎక్కడంటే..

కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకూ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతంలో అయ్యప్ప స్వాముల దర్శనం ఇస్తారు. 41 రోజుల పాటు దీక్షను చేపట్టి భక్తి శ్రద్దలతో ఇరుముడి కట్టి అయ్యప్ప శరణు ఘోషతో శబరిమల చేరుకొని అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. అయితే స్వాములు ఇరుముడి కట్టుకునే నల్లని బ్యాగ్స్ ను తక్కువ ధరతో తెలంగాణాలోని ఆది శంకరాచార్య మఠం వారు అందిస్తున్నారు.

Irumudi Bags: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే మన్నికైన ఇరుముడి బ్యాగ్స్ .. ఎక్కడంటే..
Irumudi Bags
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2024 | 7:08 PM

కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం. అనేక పండగలు, పర్వదినాలను జరుపుకుంటారు. ఈ నెల శివకేశవులతో పాటు హరిహర సుతుడు అయ్యప్ప స్వామికి పరమ ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల కు వెళ్లేందుకు భక్తులు అయ్యప్ప స్వామి మాలను ధరిస్తారు. 41 రోజుల పాటు మండల దీక్ష కొందరు.. జ్యోతి దర్శనం కోసం కొందరు దీక్షను పాటించి అనంతరం భక్తిశ్రద్దలతో ఇరుముడి కట్టుకుని శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తులు చేసే దీక్ష గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు. స్వాములు అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి ముందు ఇరుముడి కట్టుకుంటారు. ఈ ఇరుముడులను ప్రతేకంగా నల్లని బట్టతో తయారు చేసిన బ్యాగ్స్ లో కడతారు. ఈ నేపధ్యంలో శబరిమల యాత్రకు వెళ్ళే స్వాముల కోసం ఇరుముడి బ్యాగ్స్ ను మహిళా సాధికారతలో భాగంగా అందిస్తోంది. కళడి శ్రీ ఆది శంకర మఠం, తెలంగాణ ఐతే మాతృ శంకరం సంయుక్తంగా అయ్యప్ప స్వాములకు ఇరుముడి బ్యాగ్స్ ను తక్కువ ధరకే మన్నికైన బ్యాగ్స్ ను అందించనుంది.

జగద్గురు ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు ఆదిశంకర మఠం అందిస్తోంది. ఈ కాలడి శ్రీ ఆదిశంకర మఠం తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూర్ గ్రామం బొల్లారంలో ఉంది. ఈ మఠం ద్వారా అయ్యప్ప భక్తులకు అందిస్తున్న ఇరుముడి బ్యాగ్స్ ను ఆన్ లైన్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవచ్చు అని ఆలయ సిబ్బంది పేర్కొంది. ఇరుముడి బ్యాగ్స్ కోసం ఆర్డర్ చేయడానికి ఈ  లింక్‌పై క్లిక్ చేయండి. పెద్ద మొత్తంలో (100 కంటే ఎక్కువ)గా ఇరుముడి బ్యాగ్స్ ను ఆర్డర్ల ఇచ్చే భక్తులకు కస్టమైజ్డ్ ప్రింట్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..