Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ఒకప్పుడు స్ట్రీట్ చాయ్ వాలా.. ఇప్పుడు రూ. కోటి పెట్టుబడితో వ్యాపార రంగంలోకి ఎంట్రీ..

2016లో నీలికళ్లతో సంచలనం సృష్టించిన వ్యక్తి.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. దాయాది దేశం పాకిస్తాన్ చాయ్ వాలా ఇప్పుడు కోటి రూపాయల డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ యువకుడికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Video Viral: ఒకప్పుడు స్ట్రీట్ చాయ్ వాలా.. ఇప్పుడు రూ. కోటి పెట్టుబడితో వ్యాపార రంగంలోకి ఎంట్రీ..
Pak Chai WalaImage Credit source: social media
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2024 | 5:35 PM

మీరు ఇంటర్నెట్‌లో యాక్టివ్‌గా ఉండేవారు అయితే.. పాకిస్థాన్‌లోని వైరల్ చాయ్‌వాలా గురించి మీకు తెలిసే ఉండాలి. నీలి కళ్ళు, ఆ సాధారణ టీ మేకింగ్ స్టైల్ తో ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించాడు. ఈ యువకుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఈ చాయ్ వాలాకు కోటి రూపాయల ఆఫర్ వచ్చిందట. ఇది తెలిసిన తర్వాత అదృష్టం ఉంటే ఇలాగే జరుగుతుంది అని అంటున్నారు!

భారతదేశం వలె పాకిస్తాన్‌లో షాక్ ట్యాంక్ వంటి ప్రదర్శన జరుగుతోంది. పాకిస్తాన్‌లోని పెద్ద వ్యాపారవేత్తలు కొత్త స్టార్టప్‌లకు మద్దతు ఇస్తారు. తమ డబ్బును పెట్టుబడి పెడతారు. అర్షద్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. అర్షద్ తన టీ బ్రాండ్‌కు సంబంధించిన వివరాలను గురించి ఓ ప్రదర్శనలో వెల్లడించాడు. దీంతో అక్కడ కూర్చున్న పారిశ్రామికవేత్తలు ఎంతగానో ముగ్ధులై అర్షద్ కు కోటి రూపాయల ఆఫర్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఈ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, అర్షద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సమాచారాన్ని ఇచ్చాడు. దీంతో పాటు తన మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపాడు. తన పోస్ట్‌లో ఈ ఒప్పందం తనకు ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని.. తన బ్రాండ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి తాను ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

అర్షద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను దాదాపు 25 ఏళ్లుగా ఈ పని చేస్తున్నానని చెప్పాడు. ఇస్లామాబాద్‌లో సొంతంగా కేఫ్‌లను ప్రారంభించామని తెలిపాడు. అక్కడ అంతకు ముందు టీ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు మూడ్‌ను రిఫ్రెష్ చేసే టీతో పాటు, స్నాక్స్, బర్గర్లు, పాస్తా, శాండ్‌విచ్‌లు మొదలైన వాటిని కూడా ఆస్వాదించవచ్చు. ఈ కేఫ్ ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా యువత తమ స్నేహితులతో కూర్చుని టీ రుచి చూస్తూ అందమైన దృశ్యాన్ని చూస్తూ రెండింటినీ ఆస్వాదించవచ్చు. కోటి రూపాయలు వచ్చినందుకు అర్షద్ పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు. అభినందనలు కూడా తెలుపుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..