- Telugu News Photo Gallery Couple gets married in simple way and gives Water Purifiers to 26 schools with remaining money
అత్యంత నిరాడంబరంగా పెళ్లి వేడుక.. నవ జంట ఏం చేశారో తెలుస్తే ఫిదా కావాల్సిందే..
ప్రస్తుతం పెళ్ళిళ్ళు అంటే ఎంత ఘనంగా చేసుకుంటే అంత గొప్ప అనుకుంటున్నారు. ఆకాశమంత పందిరి వేసి.. భూ దేవంత పెళ్లి పీట వేసి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అదే సమయంలో కొంతమంది వధూవరులు తాము డిఫరెంట్ అంటూ పెళ్లిని చాలా సింపుల్ గా జరుపుకుని పెళ్ళికి అయ్యే ఖర్చుని మిగిల్చి సమాజానికి ఉపయోగ పడే పనులు చేస్తున్నారు. తాజాగా నవ దంపతులు తమ పెళ్లి ఖర్చుని మిగిల్చి ఆ డబ్బులతో మంచి పని చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 పాఠశాలలకు క్లీన్ వాటర్ మిషన్లను అందించారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది
Updated on: Nov 14, 2024 | 5:01 PM

విలాసవంతమైన, ఆడంబరమైన పెళ్ళిళ్ళు చేసుకుంటున్న కాలంలో.. ఒక జంట తమ పెళ్లిని అత్యంత సాదా సీదాగా జరుపుకుంది. అంతేకాదు ఇలా సింపుల్ గా పెళ్లిని జరుపుకుని మిగిలిన డబ్బులతో ఒక మంచి పని చేశారు. ఆ డబ్బులతో స్కూల్ పిల్లల దాహార్తిని తీర్చి అందరి ప్రశంసలు అందుకున్నారు ఈ నవ దంపతులు.

కర్నాటక హాసన్ జిల్లా అరకలగూడు తాలూకాలోని హొన్నవల్లి గ్రామానికి చెందిన ఇంజినీర్ వధువు శివకుమార్, మాండ్యకు చెందిన సంగీత వివాహం నవంబర్ 11న జరిగింది. ఈ జంట తమ పెళ్లిని తక్కువ ఖర్చుతో చేసుకున్నారు. తద్వారా రూ. 5 లక్షలకు పైగా ఆదా అయింది.

ఈ కొత్త జంట పెళ్లిని తక్కువ ఖర్చుతో జరుపుకోవడం వలన 5 లక్షలకు పైగా ఆదా చేయడమే కాదు ఆ డబ్బులతో 26 ప్రభుత్వ పాఠశాలలకు క్లీన్ వాటర్ మిషన్లను అందించారు. దీంతో ఈ నవ దంపతులపై ప్రశంసల వర్షం కురుస్తుంది.

తాము ఈ పని చేయడానికి తమకు తన తాత రైతు పక్షపాత పోరాట యోధుడు హెచ్‌టి.హుచ్చప్ప ప్రేరణ అని నవజోడి చెప్పారు.

హొన్నవల్లి గ్రామంలో హో.టి.హుచ్చప్ప తాత దత్తత తీసుకున్న పాఠశాలతో పాటు.. తాలూకాలోని కసబా హోబలిలోని 26 పాఠశాలలకు ఉచితంగా శుద్ధినీటి యంత్రాలను అందజేశారు ఈ నవ దంపతులు.
