Goti Talambralu: రాములోరి కల్యాణానికి గోటి తలంబ్రాలు.. కోటి అక్షతలను సిద్ధం చేస్తున్న భక్తులు…

సీతారాముల కళ్యాణం కోసం ముందే భక్తులు రెడీ అవుతున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో వినియెగించే తలంబ్రాలను చీరాలలోని రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నారు. ఇలా గోటి తలంబ్రాలను ఇక్కడ గడచిన 11 సంవత్సరాలుగా తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది.

Goti Talambralu: రాములోరి కల్యాణానికి గోటి తలంబ్రాలు.. కోటి అక్షతలను సిద్ధం చేస్తున్న భక్తులు...
Goti Talambralu Making
Follow us
Fairoz Baig

| Edited By: Surya Kala

Updated on: Nov 14, 2024 | 7:38 PM

భద్రాచలంలోని సీతారాముల వారి కల్యాణాన్ని జగత్ కల్యాణంగా అభివర్ణిస్తుంటారు. అటువంటి జగత్ కల్యాణానికి ఎంతయితే ప్రత్యేకత ఉందో.. అంత కాకున్నా ఆ కల్యాణ వేడుకలకు వినియెగించే కోటి గొటి తలంబ్రాలకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. అటువంటి కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తూ పునీతులవుతున్నారు బాపట్లజిల్లాలోని చీరాల ప్రాంత భక్తులు. ఇంతకూ ఆ తలంబ్రాల విశిష్టత ఏంటి…? ఎలా సిద్ధం చేస్తున్నారు… ఆ విశేషాలేంటో తెలుసుకుందాం…

సంస్కృతి, సంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. పండుగలు మొదలు కల్యాణ మహోత్సవాల వరకు ఒక్కొక్క వేడుకకు ఒక్కో విశిష్టత ఉంది. వేడుకలు ఏవైనా భావితరాలకు స్ఫూర్తిని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోవకు చెందినదే సీతారాముల వారి కల్యాణ మహోత్సవం. కల్యాణంలో అతి పవిత్రంగా భావించేవి తలంబ్రాలు. పసుపు, ముత్యాలు, ధాన్యాలు వివాహ వేడుకలకు వినియెగిస్తారు. వీటిలో వినియోగించే ఒక్కో వస్తువుకు ఓ ప్రత్యేకత ఉంది. పసుపు సకల శుభలకు దీపికగా, ముత్యాలు ముత్యం వంటి కల్మషం లేని మనస్సుతో వధూవరులు ఆనందంగా జీవించాలని ప్రతీకగా, ఇక ధాన్యం ధన ధాన్యాలతో సరితూగాలని భావనగా ఉంటుంది. మరి ఇలాంటి విశిష్ట కలిగినవి తలంబ్రాలు. జగత్ కళ్యాణంగా భావించే భద్రాచలం సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో దేవతమూర్తుల శిరస్సు నుంచి జాలువారే విధంగా తలంబ్రాలు పోస్తారు. అటువంటి కల్యాణోత్సవంలో గోటితో వలిచిన తలంబ్రాలను ఉపయోగిస్తారు.

ఈ సంప్రదాయం దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. రాములోరి కల్యాణంలో వినియెగించే గోటి తలంబ్రాలు సిద్ధం చేసే అరుదైన అవకాశం ప్రకాశం జిల్లా చీరాల వాసులకి దక్కింది. కల్యాణ వేడుకలలో తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమాని భావిస్తారు భక్తులు. అటువంటిది సాక్ష్యాత్తూ ఆ జానకిరాముని కల్యాణానికి వినియెగించే కోటి గోటి తాలంబ్రాలను సిద్ధం చేసే భాగ్యం దక్కితే ఆ అనుభూతే వేరు కదా. అటువంటి మహత్‌ కార్యానికి శ్రీకారం చూట్టారు బాపట్ల జిల్లా చీరాల ప్రాంత భక్తులు. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాములవారి కల్యాణానికి గత తొమ్మిది సంవత్సరాలుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామా భక్త సేవ సమితి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు ఒలిచి కల్యాణ వేడుకులకు తరలిస్తూ స్వామివారి సేవలో పునీతులవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రతి ఏటా విజయ దశమి నాటి మొదలు కొని ఉగాది వరకు అంటే ఆరు నెలలు పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో చీరాల పరిసర ప్రాంతాలలోని సీతారామ భక్తులను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. శ్రీరామనామ జపం చేస్తూ 89 క్వింటాళ్ళ తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కల్యాణ వేడుకులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం ఈ కోటి గోటి తలంబ్రాలను ఎంతో భక్తిశ్రద్దలతో నియమ నిష్ఠలతో వలుస్తూ సీతారాములోరి సేవలో పరవశిస్తున్నారు. ఇంతటి మహత్కార్యంలో తమను భాగస్వాములు చేయడం ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. అంతేనా సాక్ష్యత్తు సీతారాముల వారి కల్యాణం మహోత్సవానికి అన్ని తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమలో కలుగుతుందంటున్నారు భక్తులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?