Childless Couple: సంతానం లేని దంపతులు ఈ జ్యోతిష్య పరిహరాలను చేసి చూడండి..

Childless Couple:పెళ్లి అయిన దంపతులు(Couples) తల్లిదండ్రులుగా మారడాన్ని ఎంతో అపురూపంగా భావిస్తారు. తమ జీతానికి పరిపూర్ణమైన ఆనందం బిడ్డతోనే వచ్చిందని సంతోష పడతారు. అయితే కొంతమంది.

Childless Couple: సంతానం లేని దంపతులు ఈ జ్యోతిష్య పరిహరాలను చేసి చూడండి..
Astrological Remedy For Getting A Child Soon
Follow us
Surya Kala

|

Updated on: Jan 30, 2022 | 9:00 AM

Childless Couple:పెళ్లి అయిన దంపతులు(Couples) తల్లిదండ్రులుగా మారడాన్ని ఎంతో అపురూపంగా భావిస్తారు. తమ జీతానికి పరిపూర్ణమైన ఆనందం బిడ్డతోనే వచ్చిందని సంతోష పడతారు. అయితే కొంతమంది దంపతులకు పెళ్లి అయి ఎన్ని ఏళ్ళు అయినా సంతానం కలగదు. అయితే సంతానం కోసం వైద్యులు, నిపుణులు , మందుల సహాయం తీసుకుంటారు. దీంతో చాలా మంది దంపతుల పిల్లలు పుట్టాలనే కోరిక నెరవేరుతుంది. అయితే కొందరికి ఎంత వైద్యం తీసుకున్నా.. సంతానం కలగదు. దీనికి కారణం గ్రహ ప్రభావం లేదా వాస్తు దోషం ఉండి ఉండవచ్చు. సంతానం లేని బాధను ఎదుర్కొంటున్న దంపతులు కొన్ని జ్యోతిష్య పరిహరాలను చేయాల్సి ఉంటుంది. అటువంటి కొన్ని జ్యోతిష్య పరిహారాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..

ఎర్రావుకు సేవ మహిళకు గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉంటే.. అటువంటి స్త్రీ ఎర్రటి ఆవుకు పూజ చేయాల్సి ఉంటుంది. రొజూ ఎర్రటి ఆవుకి ఆహారం, నీరు పెట్టడం మేలు చేస్తుంది. అంతేకాదు గోధుమ రంగు కుక్కని పెంచుకోవడం కూడా మంచి జోతిష్య పరిహారం అని నమ్మకం.

వెండి వేణువు ఇంట్లో పిల్లల ఏడుపు వినడానికి ఎదురు చూసే దంపతులకు ఈ పరిహారం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి శ్రీకృష్ణుడిని ప్రార్థించడం ద్వారా తల్లిదండ్రులు అయ్యే కోరిక నెరవేరుతుంది. శ్రీకృష్ణుడికి వెండి వేణువును సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సమస్య పరిష్కారమవుతుంది.

గోమతీ చక్రం కొన్నిసార్లు మహిళలు గర్భం దాల్చడంలో సమస్యలను ఎదుర్కొంటారు. దీన్నుంచి బయటపడాలంటే శుక్రవారం నాడు గోమతీ చక్రాన్ని గుడ్డలో కట్టి స్త్రీ నడుముపై కట్టాలి. జ్యోతిష్యం ప్రకారం ఈ పరిహారం ప్రభావవంతంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం తగ్గుతుందని

పితృ దోషం పితృ దోషం ఉన్న ఇంట్లో సుఖ శాంతులు ఉండవు. కనుక పితృ దోషం తొలగిపోకపోతే..ఆ ప్రభావం ఆ ఇంట్లో ఉన్న జంటపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. పిల్లలు లేకపోవడం వంటి తీవ్రమైన సమస్యలను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. జ్యోతిష్యానికి సంబంధించిన పరిహారాలను అనుసరించడం ద్వారా పితృ దోషం తొలగిపోతుంది. పితృ దోషాలను తొలగించడానికి, పూజలు చేయడం లేదా రావి చెట్టును ఆరాధించడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు నమ్మకాల ఆధారంగా చెప్పబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Read Also : కరోనా ఎఫెక్ట్ ..భారీగా తగ్గిన జననాలు.. పెరిగిన మరణాలు..జనాభా సంక్షోభంలో ఆ దేశం.. పిల్లల్ని కనండి మహాప్రభో అంటున్న ప్రభుత్వం