Human Nature in Kaliyuga: దురాశ దుఖానికి చేటు.. ఊరిలో ఒక్కడు ధర్మం తప్పనివాడు ఉన్నా ఊరంతటికి మేలు.. కలి చెప్పిన కథ

Human Nature in Kaliyuga: నాలుగు యుగాల్లో చివరి యుగమైన కలియుగంలో మనం ఉన్నామని హిందువుల నమ్మకం.. అంతేకాదు.. ఈ యుగానికి అధిపతి కలి అని.. అతను ధర్మం తప్పిన చోట తప్పకుండ ఉంటాడని.. అందుకు..

Human Nature in Kaliyuga: దురాశ దుఖానికి చేటు.. ఊరిలో ఒక్కడు ధర్మం తప్పనివాడు ఉన్నా ఊరంతటికి మేలు.. కలి చెప్పిన కథ
Kaliyug

Human Nature in Kaliyuga: నాలుగు యుగాల్లో చివరి యుగమైన కలియుగంలో మనం ఉన్నామని హిందువుల నమ్మకం.. అంతేకాదు.. ఈ యుగానికి అధిపతి కలి అని.. అతను ధర్మం తప్పిన చోట తప్పకుండ ఉంటాడని.. అందుకు తగిన శిక్షను విధిస్తాడని.. పురాణాల కథనం. అందుకు తగినట్లుగానే ప్రస్తుతం ఎక్కడ ఏ తుఫాన్లు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినా.. ఎయిడ్స్, ఎబోలా, కరోనా వంటి వైరస్ లు వెలుగులోకి వచ్చినా పెద్దలు ఇది కలియుగం ..మనిషి అంతానికి యుద్ధాలు రావు ఇలాంటివె ఏర్పడతాయి. అయితే వీటన్నింటి నుంచి ఒక్క మంచి వాడు ఉన్నా కాపాడతాడు అని పెద్దల నమ్మకం. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ కథ..

ఒక ఊరి పెద్ద యజ్ఞం చేస్తున్నాడు.. అప్పుడు ఆ యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు . అప్పుడు భార్య చెప్పింది. “నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది.” అని చెప్పింది. అయితే ఆ ఊరి పెద్ద భార్య చెప్పిన విషయం నిజమో కాదో పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది. ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు.

అయితే ఆ ఊరిలో ఉన్న ఒక్క అర్క సోమయాజి మాత్రం .. “యజ్ఞం పవిత్రమైంది. యజ్ఞ కుండం పవిత్రమైంది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు” అన్నాడాయన. ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప. ఇది ఆయన భార్యకు నచ్చలేదు.”మనమూ యజ్ఞకుండంలో ఉమ్మేద్దాం. బంగారం తీసుకుని ధనవంతులం అవుదాం అని భర్తను అడిగింది.

అయితే భార్య కోరికను విన్న అర్కసోమయాజి ఆపని చేయడానికి అంగీకరించలేదు. దీంతో ఆమె కోపంతో .. పుట్టింటికి పయనమైంది. భార్యకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా భార్య వెనుకనే వెళ్లాడు. అలా భార్యాభర్తలు ఇద్దరూ ఊరి పొలిమేర దాటారు.. వెంటనే ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నాయి.. మనుషులు ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోయారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఆ ఊరిలో ఒక్కరూ మిగల్లేదు. అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.
అప్పుడు ఆ దంపతులకు కలిపురుషుడు ఎదురు వచ్చాడు. “ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను.” అన్నాడు కలిపురుషుడు. ఈ మాట విన్న వెంటనే అర్క సోమయాజీ భార్య తన తప్పు తెలుసుకొని భర్తను క్షమించమని అడిగింది. ఈ కథ వలన దురాశ దుఃఖానికి చేటు అని.. ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతగానే నిలుస్తాడని తెలుస్తోంది.

 

Also Read: Vinayaka Chaviti : చర్చి లోపలికి వినాయక విగ్రహాన్ని తీసుకుని రమ్మని కోరిన మత పెద్దలు.. గణేషుడిని కీర్తిస్తూ ప్రార్ధనలు ఎక్కడంటే..

 

Click on your DTH Provider to Add TV9 Telugu