Vinayaka Chaviti : చర్చి లోపలికి వినాయక విగ్రహాన్ని తీసుకుని రమ్మని కోరిన మత పెద్దలు.. గణేషుడిని కీర్తిస్తూ ప్రార్ధనలు ఎక్కడంటే..
Vinayaka Chaviti in Church: విఘ్నాలకధిపతి వినాయకుడిని భారత దేశంలోని హిందువులే కాదు.. పశ్చిమాసియాలోని అనేక దేశాలు గణపతిని వివిధ పేర్లతో.. విభిన్న రూపాలతో పూజిస్తారు. అయితే ప్రపంచంలోనే అనేక దేశాల్లో..
Vinayaka Chaviti in Church: విఘ్నాలకధిపతి వినాయకుడిని భారత దేశంలోని హిందువులే కాదు.. పశ్చిమాసియాలోని అనేక దేశాలు గణపతిని వివిధ పేర్లతో.. విభిన్న రూపాలతో పూజిస్తారు. అయితే ప్రపంచంలోనే అనేక దేశాల్లో భారతీయులున్నారు. అక్కడ స్థానిక కాలమానం ప్రకారం.. హిందువుల పండగలను ప్రవాసభారతీయ హిందువులు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ.. జరుపుకుంటారు. తాజాగా .. గణేష్ విగ్రహాన్ని కొంతమంది హిందువులు ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నారు.. అది చూసిన కొంతమంది స్థానికులు గణేషుడిని చర్చులోకి తీసుకుని రమ్మనమని చెప్పారు.. అలా చర్చిలోకి వినాయక విగ్రహం తీసుకుని వెళ్లిన తర్వాత అక్కడవారు గణేషుడిని ప్రార్ధించారు. ఈ అరుదైన ఘటన యురేపియన్ దేశమైన స్పెయిన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
స్పెయిన్‌లో కొంతమంది భారతీయుల బృందం గణపతి విగ్రహాన్ని చవితి వేడుకల కోసం తీసుకుని వెళ్తుండగా.. కొంతమంది చర్చి లోపలకు వినాయుకుడి విగ్రహం తీసుకురావాలని కోరింది.. దీంతో చర్చిలో జీసస్ , గణేష్ ఇద్దరూ కలుసుకున్నారు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు.
స్పెయిన్‌లో నివసిస్తున్న భారతీయుల బృందం వినాయకుని ఊరేగింపులో పాల్గొన్నారు. వారు చర్చి మార్గంలో వెళ్ళవలసి వచ్చింది… అప్పుడు అక్కడ ఉన్న మత స్థల అధికారుల నుండి అనుమతి కోరారు. వెంటనే స్పందించిన చర్చి బృందం.. గణపతి బప్ప విగ్రహాన్ని హాల్ లోపల తీసుకురావాలని కోరింది. అలా చర్చి లోపలకు గణపతి విగ్రహం తీసుకుని వెళ్తున్న సమయంలో చర్చి లోపల ఉన్న వ్యక్తులు గణేషుడిని కీర్తించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
In Spain, Indians who organized the Ganesh festival asked the Church if they could take the Ganesh ji from the Church’s way. The church asked them to bring Ganpati Bappa inside the church so that both Gods can meet with each other. (From a friend in Spain) pic.twitter.com/cub9krjnS3
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 8, 2021