Significance of Saree: సందర్భాన్ని బట్టి చీరను ఎంచుకోవడం ఒక ఆర్ట్.. మహిళలు ఎంచుకునే శారీ కలర్స్ .. వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందట..

Significance of Saree: భారతీయ సంప్రదాయంలో చీరలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. చుడీదార్లు, జీన్స్, ఫ్రాక్స్ ఇలా ఎన్నిరకాల డ్రెస్సులు వచ్చినా కొంచెం వయసు రాగానే ఆడవారు చీరలను ధరించడానికె ప్రాధాన్యతనిస్తారు. చీరలు స్త్రీలను హుందాగా చూపిస్తాయి కూడా ఇక చిన్న పెద్ద అనే తేడాలేదు.. ఏ సమయంలో ఎన్ని రకాలుగా దుస్తులు ధరించినా పండగలు, పంక్షన్లు, శుభకార్యాలు ఇలా ఏమి వచ్చినా సందర్భాన్ని బట్టి, నేత […]

Significance of Saree: సందర్భాన్ని బట్టి చీరను ఎంచుకోవడం ఒక ఆర్ట్.. మహిళలు ఎంచుకునే శారీ కలర్స్ .. వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందట..
Sarees

Significance of Saree: భారతీయ సంప్రదాయంలో చీరలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. చుడీదార్లు, జీన్స్, ఫ్రాక్స్ ఇలా ఎన్నిరకాల డ్రెస్సులు వచ్చినా కొంచెం వయసు రాగానే ఆడవారు చీరలను ధరించడానికె ప్రాధాన్యతనిస్తారు. చీరలు స్త్రీలను హుందాగా చూపిస్తాయి కూడా ఇక చిన్న పెద్ద అనే తేడాలేదు.. ఏ సమయంలో ఎన్ని రకాలుగా దుస్తులు ధరించినా పండగలు, పంక్షన్లు, శుభకార్యాలు ఇలా ఏమి వచ్చినా సందర్భాన్ని బట్టి, నేత చీరలు, పట్టుచీరలు, డిజైనర్ చీరలు ధరించడానికి ఇష్టపడతారు. ఇక పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చింది. ఇక ఆధునిక ప్రపంచంలో పట్టు చీరల తయారీకి మగ్గాలను, మిషనరీ రెండిటిని వినియోగిస్తున్నారు. నాణ్యత కొరకు మగ్గాలపై నేయబడిన పట్టుచీరలకు నేటికీ గిరాకీ అధికంగా ఉంది. సాధారణ జరీనుంచి వెండి జరీ దాకా వర్క్ చేసిన పట్టు చీరల ధరలు కూడా ఎక్కువే.. అయితే వీటి ధర ఎక్కువ.. ఇక పెళ్లి పట్టుచీరలు ఐతే మహిళలు పదిలంగా తమ పిల్లల, పిల్లలకు కూడా చూపించుకుంటూ తమ పెళ్ళినాటి విశేషాలను గుర్తు చేసుకుంటారు. అయితే మహిళలు చీరలు ధరించే సందర్భాన్ని బట్టి డిఫరెంట్ సారీస్ ఎంచుకుంటారు. ఇక వారు ఎంచుకునే కలర్స్ కూడా వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయంట.. అవి ఏమిటో చూద్దాం..!

పెళ్లి, పండగ, ఫంక్షన్, విషాదం ఇలా సందర్భం బట్టి చీరను ధరించడం ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది.ఇంకా చెప్పాలంటే సందర్భం బట్టి చీరను ఎంచుకోవడం ఒక ఆర్ట్.. పెళ్లిళ్లలో ఖరీదైన పట్టు చీరలు, దానికి తగిన నగలతో దర్శనమిచ్చే మహిళలు.. అదే గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు సిల్క్,  కాటన్ వంటి సాదా చీరల్లో కనిపిస్తారు. అదే ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వహించే మహిళలు కాటన్ చీరలను ధరించి మంచి హుందాగా కనిపిస్తారు.

ఇక వేసవి కాలంలో చీరలను ధరించాలంటే లైట్ కలర్స్ చీరలు, తెలుగు రంగు చీరలు కాటన్ చీరలు ఉత్తమం. అదే వర్షాకాలంలో చీరలను ధరించాలంటే సిల్క్ మిక్స్డ్  చీరలు ఉత్తమం. ఇవి నీటిని త్వరగా పీల్చుకోవు.. అంతేకాదు త్వరగా సరిపోతాయి. ఇక శీతాకాలంలో డార్క్ కలర్ చీరలు ధరిస్తే వారి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి.

పండుగలు, ఉత్సవాలు సమయాల్లో ముదురు రంగు చీరలు ధరిస్తే పదిమందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు.  అంతేకాదు సాంప్రదాయంగా లక్ష్మీదేవిలా కనిపిస్తున్నారంటూ పెద్దల ప్రశంసలను కూడా  అందుకుంటారు. అయితే చాలామంది తమకు నలుపు రంగు అంటే ఇష్టం అంటూ.. సమయం సందర్భాన్ని పట్టించుకోకుండా నలుపు రంగు చీరలను ధరిస్తారు. అయితే ఇలాంటి మహిళలు పట్ల పెద్దవారికి మంచి అభిప్రాయం ఉండాడు.. నలుపు విషాదానికి గుర్తుగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు కనుక విషాద సమయాల లో తప్ప నలుపు రంగు చీరలు తరచు ధరించడం మంచిది కాదు. అంతేకాదు నలుపు రంగులో ఉండే చీరలు వెచ్చదనాన్ని శరీరానికి అందిస్తాయి. ఇక వారిని సంకుచిత భావాలు గల వారిగా ముద్ర వేస్తాయి.

ఇక స్త్రీలు చీరలు ధరించినప్పుడు వారు ఎంచుకునే కలర్స్  వారి ఆలోచనా తీరు, ప్రవర్తనను తెలియజేస్తాయి.  ముదురు రంగు చీరలను ధరించేవారు అగ్రెసివ్’గా ఉంటారని..  లైట్ కలర్స్ చీరలను ధరించేవారి నేచర్ ‘కూల్’ అని ఎదుటివారు భావిస్తారు. న పూజల విషయంలో డార్క్ ఎల్లో, గ్రీన్, రెడ్ వంటి చీరలు ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తాయి.

Also Read :  ఈ ఫొటోలో చిన్నారిని గుర్తు పట్టారా.. హిస్టారికల్ మూవీలో మెగా హీరోకి.. జోడీగా నటిస్తున్న ముంబై బ్యూటీ ..

Click on your DTH Provider to Add TV9 Telugu