Childhood Photo: ఈ ఫొటోలో చిన్నారిని గుర్తు పట్టారా.. హిస్టారికల్ మూవీలో మెగా హీరోకి.. జోడీగా నటిస్తున్న ముంబై బ్యూటీ ..
Childhood Photo: స్టార్ హీరోలకు జోడీగా నటించే హీరోయిన్ కు ఉండే క్రేజ్ వేరు.. ఇక కొంతమంది హీరోలకు జోడీగా ఒక్క సినిమాలో నటించినా చాలు అనే స్టార్ హీరోయిన్ల గురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం. ఇక తమ అభిమాన హీరో పక్కన నటించే..
Childhood Photo: స్టార్ హీరోలకు జోడీగా నటించే హీరోయిన్ కు ఉండే క్రేజ్ వేరు.. ఇక కొంతమంది హీరోలకు జోడీగా ఒక్క సినిమాలో నటించినా చాలు అనే స్టార్ హీరోయిన్ల గురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం. ఇక తమ అభిమాన హీరో పక్కన నటించే హీరోయిన్ కు సంబంధించిన విషయాలపై ఆసక్తిని కనబరుస్తూనే ఉంటారు. వారి చిన్న తనంలో ఫోటోలు, చదువు, కెరీర్ వంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ పాత్రలో నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కు జోడీగా నటిస్తున్న నిధి అగర్వాల్ చిన్నతనం ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
‘హరి హర వీర మల్లు’ చిత్రంలో నిధి పంచమి’ గా నటించబోతుంది. ఇప్పటికే నిధి ట్రెడిషనల్ వేర్‌లో నాట్యం చేస్తున్న నిధి లుక్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ ముంబై బ్యూటీ తెలుగులో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య “సవ్య సాచి” మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మిస్టర్ మజ్ను , “ఇస్మార్ట్ శంకర్” వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ రాణిస్తోంది. సినిమా పరిశ్రమకు వచ్చిన కొంచెం సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో చిత్రంలో అవకాశం దక్కించుకున్న నిధి అగర్వాల్ పై ఫిల్మ్ నగర్ వాసుల దృష్టి పడింది ఇప్పుడు. ఇటీవలే నిధి అగర్వాల్ తమిళంలో ప్రముఖ హీరో “జయం రవి” హీరోగా నటించిన “భూమి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది.
పంచమిగా నటిస్తున్న నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ, దర్శకుడు క్రిష్ ట్వీట్ చేశారు. “బ్యూటీ బ్యూటీ ఎలిగెంట్ అండ్ రేడియంట్ ఆఫ్ ది మూన్ … మా బ్రహ్మాండమైన పంచమి నిధి అగర్వాల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పారు. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా కుతుబ్ షాహీస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. ప్రతీ విషయం స్పెషల్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది.
హరి హర వీర మల్లు పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇతర భాషలలో ఒకేసారి విడుదల అవుతుంది. ఈ సినిమా కోసం ఇతర భాషల నటీనటులను తీసుకున్నారు. పవన్ సరసన.. నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. చారిత్రక పరిస్థితులను కళ్లకు కట్టేందుకు చార్మినార్ తోపాటు గండికోట సంస్థానం సెట్ ను కూడా నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్ ఫ్యాన్స్ ఊహలకు అందని స్థాయిలో ఉంటాయని ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే నిర్మాత భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
Also Read: 40 ఇంచుల స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. అయితే అమెజాన్‌లో బెస్ట్ ఆఫర్.. ఓ లుక్ వేయండి మరి..