Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi in Brics Summit: 15ఏళ్లలో బ్రిక్స్‌ కూటమి మరింత శక్తివంతంగా తయారుకావాలి.. 13వ బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బ్రిక్స్‌ దేశాల వార్షిక సదస్సు జరిగింది. ఆఫ్ఘన్‌ పరిణామాలతో పాటు కరోనా నియంత్రణపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది.

Modi in Brics Summit: 15ఏళ్లలో బ్రిక్స్‌ కూటమి మరింత శక్తివంతంగా తయారుకావాలి.. 13వ బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ
Pm Narendra Modi Chairs 13th Brics Summit
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 09, 2021 | 7:54 PM

13th Brics Summit: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బ్రిక్స్‌ దేశాల వార్షిక సదస్సు జరిగింది. ఆఫ్ఘన్‌ పరిణామాలతో పాటు కరోనా నియంత్రణపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. వర్చువల్‌ విధానంలో జరగనున్న ఈ సదస్సులో భారత్‌ నుంచి ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షులు జైర్ బోల్సనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా, బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో పాల్గొననున్నారు.

ముఖ్యంగా ‘అంతర్గత సహకారం’ అనే అంశం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 15ఏళ్లలో బ్రిక్స్‌ కూటమి మరింత శక్తివంతంగా తయారుకావాలని అన్నారు. అమెరికా దళాల ఆకస్మాత్తుగా ఉపసంహరించుకోవడంతోనే ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభం వచ్చిందని రష్యా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గుర్తు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తన పొరుగు దేశాలకు ముప్పుగా మారకూడదు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణాను పూర్తిస్థాయి కట్టడి చేయాలని పుతిన్ అన్నారు. బ్రిక్స్ సహకారంలో దృఢమైన, స్థిరమైన పురోగతిని సాధించగలమని చైనా అధ్యక్షులు జిన్ పింగ్ చెప్పారు. గత 15 సంవత్సరాలుగా, ఈ ఐదు దేశాలు వ్యూహాత్మకంగా కమ్యూనికేషన్, రాజకీయ విశ్వాసాన్ని పంచుకున్నాయన్న ఆయన.. బ్రిక్స్ దేశాల మధ్య సమగ్రత, సమానత్వం స్ఫూర్తిని పెంపొందించుకున్నాయన్నారు, ఒకరి సామాజిక వ్యవస్థ, అభివృద్ధి, ఒకరితో ఒకరు పంచుకోవడానికి బ్రిక్స్ సమ్మిట్ మంచి మార్గం అని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అన్నారు .

COVID-19 నియంత్రణకు బ్రిక్స్ దేశాలన్ని కలిసి కట్టుకట్టుగా పనిచేసినప్పుడు ఏమి సాధించవచ్చో నిరూపించిందని బ్రిక్స్ దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ దేశాలుగా మనం మన ప్రజల జీవితాలను, జీవనోపాధులను కాపాడటం, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడం, ప్రజా వ్యవస్థల స్థితిస్థాపకతను మెరుగుపరచడం కొనసాగించాలని దక్షిణాఫ్రికా అధ్యక్షులు రామఫోసా అన్నారు.

Read Also…  KRMB: తెలుగురాష్ట్రాల మధ్య ముదురుతున్న జలజగడం.. మరోసారి కృష్ణా వాటర్‌ బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

Ford India: భారత్ లో తన కార్ల తయారీ ప్లాంట్లను మూసివేస్తున్న ఫోర్డ్.. ఎందుకంటే..