KRMB: తెలుగురాష్ట్రాల మధ్య ముదురుతున్న జలజగడం.. మరోసారి కృష్ణా వాటర్ బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ
తెలుగురాష్ట్రాల్లో జల జగడంపై లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా కృష్ణానది యాజమాన్య బోర్డ్‌కి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది.

Telangana ENC Letter: తెలుగురాష్ట్రాల్లో జల జగడంపై లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా కృష్ణానది యాజమాన్య బోర్డ్‌కి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. పొతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడికాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటి వాడకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీలకు మించి నీరు తీసుకోకుండా చూడాలని లేఖలో పేర్కొంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్ గురువారం లేఖ రాశారు.
కృష్ణా నది నుంచి పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడికాలువ ద్వారా ఏపీకి అక్రమంగా నీళ్లను తరలిస్తున్నారంటూ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీ 34 టీఎంసీలకు మంచి నీరు తీసుకోకుండా చూడాలని బోర్డు చైర్మన్‌ను ఈఎస్‌సీ కోరారు. శ్రీశైలం డ్యామ్‌లో 880 అడుగులపైన నీరు ఉన్నప్పుడు మాత్రమే.. ఏపీ 34 టీఎంసీలే తీసుకోవాలని, అంతకు మించి తీసుకోకుండా చూడాలని నిబంధన ఉందని, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నీటిని అక్రమంగా తరలిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడును 11,150 క్యూసెక్కుల వరకు విడుదల చేసేందుకు డిజైన్ చేశారని, శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20వేల క్యూసెక్కులకు పెంచారన్నారు.
ఏపీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను గెజిట్‌లో చేర్చాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది. ప్రాజెక్టుల పనులను గెజిట్ రెండో షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా అధిక జలాల తరలిస్తోందని ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు. వరద సమయాల్లో జూలై, అక్టోబర్ మధ్య మాత్రమే నీరు వదలాలని, 34 టీఎంసీలకు మంచి తీసుకోవడానికి జలసంఘం అనుమతి లేదని చెప్పారు. శ్రీశైలం నుంచి వెంటనే నీటి విడుదల ఆపేయాలని కేఆర్ఎంబీ చైర్మన్‌ను కోరారు. పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌ఎంసీని, ఎస్కేప్ రెగ్యులేటర్, తెలుగు గంగ ప్రాజెక్టులు అనుమతి లేనివిగా పేర్కొనాలని లేఖలో కోరారు.
కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ
Read Also… Kisan Vikas Patra: పోస్టాఫీసులో అదిరిపోయే పథకం.. ఇందులో రూ.1 లక్ష పెట్టుబడికి రూ. 2 లక్షలు పొందవచ్చు