AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan New Rule: తాలిబన్ అడుగుజాడల్లో పాకిస్తాన్ ప్రభుత్వం..విద్యాసంస్థల్లో ఆ విధంగా ఉండకూడదని హుకుం జారీ..

ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని ఓ సామెత. అది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ.. తాలిబన్ల స్నేహంతో క్రమేపీ పాకిస్తాన్ పాలకులు కూడా వారి అడుగుజాడల్లో నడవటం మొదలు పెట్టారు.

Pakistan New Rule: తాలిబన్ అడుగుజాడల్లో పాకిస్తాన్ ప్రభుత్వం..విద్యాసంస్థల్లో ఆ విధంగా ఉండకూడదని హుకుం జారీ..
Pakistan New Rule
KVD Varma
|

Updated on: Sep 09, 2021 | 2:25 PM

Share

Pakistan New Rule: ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని ఓ సామెత. అది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ.. తాలిబన్ల స్నేహంతో క్రమేపీ పాకిస్తాన్ పాలకులు కూడా వారి అడుగుజాడల్లో నడవటం మొదలు పెట్టారు. పుట్టించి..పెంచి.. పోషించి..అందలమెక్కించిన తాలిబన్లు ఏ రకమైన రాజ్యం కావాలని కోరుకుంటారో అదే రకమైన పాలన తమ దేశంలోనూ సాగించాలని పాకిస్తాను ప్రయత్నిస్తున్నట్టుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఆక్రమణ ప్రభావం పాకిస్తాన్‌లో కూడా కనిపించడం ప్రారంభమైంది. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అన్ని కేంద్ర విద్యా సంస్థల ఉపాధ్యాయుల కోసం ఒక డిక్రీని జారీ చేసింది. ఫెడరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (FDE) కింద ఏ పాఠశాల, కళాశాల లేదా విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు లేదా టైట్స్ ధరించకూడదని ఇది పేర్కొంది. దీనికి కొన్ని రోజుల ముందు, బహవల్‌పూర్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు అలాంటి దుస్తులు ధరించకుండా అడ్డుకున్నారు. పాకిస్థాన్‌లోని ప్రముఖ విద్యావేత్త పర్వేజ్ హుద్భాయ్‌తో సహా చాలా మంది ప్రభుత్వ ఈ ఆదేశాన్ని వ్యతిరేకించారు. ఒక టీవీ కార్యక్రమంలో పర్వేజ్ మాట్లాడుతూ- ”మేము ఇప్పటికే ప్రతి విషయంలో చాలా వెనుకబడి ఉన్నాము, ఇప్పుడు ప్రభుత్వం నాణ్యమైన విద్యకు బదులుగా తాలిబాన్ పాలనను అవలంబించబోతోంది.” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇమ్రాన్ ప్రభుత్వ కొత్త కోడ్ FDE ద్వారా సెప్టెంబర్ 7 న ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో ”FDE పరిశోధన సమయంలో ప్రజల మనస్సుపై దుస్తులు చూపిస్తున్న ప్రభావం మామూలుగా చెప్పుకునే దానికన్నా ఎక్కువ వుందని తేలింది. ఈ అభిప్రాయం విద్యార్థులపై మాత్రమే ఉంది. ఉపాధ్యాయులు ధరిస్తున్న దుస్తుల ప్రభావం విద్యార్ధుల మీద పడుతుందనేది స్పష్టం అయింది. అందుకే, మహిళా ఉపాధ్యాయులు ఇప్పటి నుండి జీన్స్ లేదా టైట్స్ ధరించకూడదని మేము నిర్ణయించుకున్నాము. పురుష ఉపాధ్యాయులు కూడా జీన్స్, టీ షర్టులు ధరించకుండా ఉండాల్సిందే. అదేవిధంగా వారు క్లాస్, ల్యాబ్‌లలో టీచింగ్ గౌన్‌లు లేదా కోట్లు ధరించాల్సి ఉంటుంది.

ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పంజాబ్ ప్రావిన్స్‌లో కూడా ప్రభుత్వం ఉంది. గత వారం ఇక్కడ, బహవల్‌పూర్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు జీన్స్, టీ షర్టులు ధరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. సాంప్రదాయ దుస్తులు మాత్రమే అనుమతించబడతాయని.. దానిపై మెడికల్ కోటు అవసరమని పేర్కొంది.

పాకిస్తాన్ ప్రభుత్వ ఈ నిర్ణయంపై అనేక అనేక అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ వార్తా చానల్లో నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా మీడియాలో పలువురు తమ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రధాని దుస్తులను నినదిస్తున్న దేశంలో ఇలాంటి డిక్రీలు జారీ కావడంలో ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు. మూడేళ్ళ బాలికలపై జరుగుతున్నా అత్యాచారాలు.. హత్యలకు ఏ దుస్తుల నియమాలు కారణమో ప్రభుత్వం వివరించాలి అని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశంలో పాశ్చాత్య దుస్తులు .. ఇతర దేశాల సినిమాలు కూడా దేశంలో లైంగిక నేరాలకు కారణమని పేర్కొన్నారు. ప్రజలు తమ పాశ్చాత్య మనస్తత్వాన్ని నివారించాలని ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Afghanistan Crisis: తాలిబన్ల దాష్టీకం.. జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడి.. నిరసనలు ప్రసారం చేశారని..

China-taliban: తాలిబన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డ్రాగన్ కంట్రీ.. భారీగా ఆర్ధిక సహాయం..