AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HOROSCOPE TODAY : నూతన ఉత్సాహంతో వ్యవహారాలు పూర్తి.. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది..

RASI PHALALU- 2021 ON MAY 26 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను

HOROSCOPE TODAY :  నూతన ఉత్సాహంతో వ్యవహారాలు పూర్తి.. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది..
Horoscope Today
uppula Raju
| Edited By: Phani CH|

Updated on: May 26, 2021 | 7:03 AM

Share

RASI PHALALU- 2021 ON MAY 26 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు బుధవారం (మే 26న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి : నూతన ఉత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. పని పాట లేని వాళ్ళు మీ పనులకు ఆటంకం కలిగించి టైం వేస్ట్ చేస్తారు. సమయం వృధా అయ్యిందని మీకు బాధ. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. మీ నిర్ణయ శక్తి మీద మీరు పోగొట్టుకున్న నమ్మకం తిరిగి వస్తుంది.

వృషభ రాశి : ఆర్థిక పరిస్థితి పూర్తిగా చక్కబడుతుంది. ధన లాభం ఉంది. ముఖ్య కార్యాలలో శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల మరియు ఆత్మీయుల మద్దతు లభిస్తుంది కొత్త కార్యాలు చేపడతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేక ధన లాభం మిమ్మల్ని సంతోషానికి గురిచేస్తుంది.

మిధున రాశి : మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి ఇది మీ ఎనర్జీ ని కాపాడుతుంది. వ్యాపారంలో లాభాల కొరకు కొత్త మార్గాలను వెతుకుతారు విజయం సాధిస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కొంత శ్రమ కలిగిస్తాయి. ఈ రాశి స్త్రీలకు ఇంతకాలం బిజీగా గడిపి అలిసిపోయిన మీకు విశ్రాంతి కావాలనిపిస్తుంది.

కర్కాటక రాశి : కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడుల విషయంలో మీ దగ్గరకు వచ్చిన అన్ని అవకాశాలను పరిశీలించి తగిన సలహా తీసుకుని పెట్టుబడి పెట్టండి. అదృష్టం మీ పక్షాన లేదు అని ఇంతవరకు మీరు బాధ పడిన విషయాలలో దైవ సహాయం లభిస్తుంది. దాని వలన అద్భుత మైన విజయం లభిస్తుంది.

సింహ రాశి : మీ చిరకాల స్వప్నం నెరవేరే అవకాశం. తలపెట్టిన కార్యాలు విజయాన్ని ఇస్తాయి. మీరు ఇంత వరకు పెట్టిన పెట్టుబడుల వలన లాభాలు అందుకునే సమయం వచ్చింది. ఉద్యోగంలో వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. మీ కుటుంబ విషయాలలో మూడవ వ్యక్తి జోక్యం నివారించండి.

వృశ్చిక రాశి : నూతన వ్యక్తులతో పరిచయం. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వంశపారంపర్యంగా రావలసిన ధనం చేతికందుతుంది. మీ సాహసోపేతమైన నిర్ణయం వలన ఎంతో కాలంగా తేలకుండా ఉన్న విషయం మీకు అనుకూలంగా తెలుస్తుంది. బెట్టింగ్, స్పెక్యులేషన్ ల వలన డబ్బు నష్టం.

కన్య రాశి : ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో అధిక శ్రమ కనబడుతుంది. అయినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆదాయము ను మించి ఖర్చులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు వాహనము నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. విదేశాలకు సంబంధించిన వ్యాపారంలో ఈరోజు లాభాలున్నాయి.

తులా రాశి : అన్ని విధాలుగా పురోగతి. మానసిక ఆనందం వలన ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించండి. విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. ఈ కరోనా సమయంలో కుటుంబంలోని పెద్ద వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి.

ధనస్సు రాశి : ఆధ్యాత్మిక చింతన వలన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మితంగా మాట్లాడటం, సహనంతో వ్యవహరించడం ఈ రెండు విషయాల ఈరోజు తెలుసుకుంటారు. హఠాత్తుగా ఏ నిర్ణయం తీసుకోకండి. ఆర్థికపరంగా అనుకోకుండా డబ్బు లాభం.

మకర రాశి : ఆనందకరమైన రోజు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొంతమంది వ్యక్తుల మాటలు మిమ్మల్ని బాధ పెడతాయి కోపం తెచ్చుకోకండి. విద్యార్థులకు పరీక్షలలో ఉత్తీర్ణత. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆఫీసులో పనిని ప్లాన్ వేసుకొని పూర్తి చేయండి.

కుంభ రాశి : ఆనందకరమైన రోజు. ఆఫీసులో మీ పనులన్నింటిని అతి సులభంగా చేస్తారు. పాత పనులను కూడా పూర్తి చేస్తారు పై వారి మెప్పు పొందుతారు. బహుమతుల రూపంలో ధనలాభం. వ్యాపార వర్గాల వారికి లాభాలు. ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టెటప్పుడు జాగ్రత్త వహించండి మీ ఉల్లాస మనస్తత్వమే ఆరోగ్య భాగ్యం.

మీన రాశి : దైవ సహాయం మీకు అందుతుంది. మీ మనసు గాలిలో తేలినట్లు ఈ రోజుని ఆనందకరంగా గడుపుతారు. ఆఫీసులోని పనులలో తోటి ఉద్యోగస్తులు సహాయం అందుతుంది. ధన లాభం ఉంది. ఎవ్వరికి అప్పు ఇవ్వకండి. వివాహం కాని వారికి వివాహ అవకాశాలు. మీ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారు.