Horoscope Today: ఈ రాశి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.. తొందరపడి ఏ పని చేయకూడదు. ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today: మనిషి తన భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాడు. రాశిఫలాలు భవిష్యత్తును అంచనా వేయడానికి ఓ మార్గంగా ఉపయోగపడుతుంది...
Horoscope Today: మనిషి తన భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాడు. రాశిఫలాలు భవిష్యత్తును అంచనా వేయడానికి ఓ మార్గంగా ఉపయోగపడుతుంది. వీటి ఆధారంగా.. చేసే పనులను కొనసాగించాలా.? వాయిదా వేయాలా? అన్న నిర్ణయాలు తీసుకునే వారు చాలా మంది ఉంటారు. ఈ క్రమంలో గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూడండి..
మేషరాశి..
ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఊహించని ఫలితాలు పొందో అవకాశాలు ఉంటాయి. అనుకున్న పనుల్లో ప్రయోజనాలు పొందుతుంటారు. మహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
వృషభ రాశి..
వృషభ రాశివారికి ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కుటుంబ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. పేదవారికి అన్నదానం చేస్తే ఈ రాశి వారికి మంచి జరుగుతుంది.
మిధున రాశి..
ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ, వ్యాపార సంబంధిత విషయాల్లో ఒత్తిడి ఎదుర్కునే అవకాశాలున్నాయి, జాగ్రత్తగా ఉండడం మంచిది. శ్రీరామ రక్ష స్తో్త్ర పారాయణం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.
కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి ఈరోజు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయితే వృథా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
సింహరాశి..
ఈ రాశివారు ఈరోజు సన్నిహితులను కలుసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. లక్ష్మీ నారసింహ వారి దర్శనం మేలు చేస్తుంది.
కన్య రాశి..
కన్య రాశివారికి ఈరోజు కొన్ని వ్యవహారిక విషయాల్లో ప్రతిబంధకాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
తులరాశి..
ఈ రాశివారు ఈరోజు సన్నిహితులను కలుసుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది.
వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులను పూర్తి చేసుకోగలుగుతారు. పేదవారికి కాయగూరలు దానం చేసుకోవడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
ధనుస్సు రాశి..
ఈ రాశివారు తాము చేపట్టిన కొన్ని కార్యక్రమాల విషయమై ఒప్పందాల విషయంలో సమీక్షలు చేసుకుంటుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. శివారాధరణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
మకర రాశి..
మకర రాశి వారు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయ స్తోత్రత పారాయణం మేలు చేస్తుంది.
కుంభరాశి..
ఈ రాశివారు ఈరోజు వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి ఎలాంటి పనులు చేపట్టకూడదు. దుర్గ అమ్మవారికి కుంకుమ అర్చన ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
మీన రాశి..
మీన రాశి వారికి శ్రమ పెరుగుతుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. రావాల్సిన బాకీల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
Also Read: Thirumala seven hills : పొగమంచుతో మరింత అందాన్నిస్తున్న తిరుమల సప్తగిరులు, పరవశించిపోతోన్న భక్తజనం
గోవాలో విశిష్టమైన పరమేశ్వరుని ఆలయం.. పరమ శివుడు ప్రత్యేక్షమైన ప్రదేశం గురించి తెలుసా..