Vijayawada Durga Temple new EO : విజయవాడ దుర్గ గుడి ఈవో సురేష్ బాబు బదిలీ, అతని స్థానంలో తక్షణ నియామకం

Vijayawada Durga Temple new EO Bramaramba : విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈఓ గా ప్రస్తుతమున్న సురేష్ బాబు బదిలీ అయ్యారు..

Vijayawada Durga Temple new EO : విజయవాడ దుర్గ గుడి ఈవో సురేష్ బాబు బదిలీ, అతని స్థానంలో తక్షణ నియామకం
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 07, 2021 | 6:41 PM

Vijayawada Durga Temple new EO Bramaramba : విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈఓ గా ప్రస్తుతమున్న సురేష్ బాబు బదిలీ అయ్యారు. అతని స్థానంలో దేవస్థానం జాయింట్ కమిషనర్.. నూతన ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ (ఈఓ) గా భ్రమరాంబ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి వాణీమోహన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, సురేష్ బాబును ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రీజినల్ జాయింట్ కమిషనర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, దుర్గగుడిలో ఇటీవల ఏసీబీ అధికారులు సోదాలు చేసి దేవస్థానంలో అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రాథమిక నివేదిక ఆధారంగా 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం అప్పట్లో సస్పెండ్ చేసింది. దేవస్థానంలో గత రెండేళ్లుగా జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అభియోగాలు మోపుతూ మరో నివేదికను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అప్పట్లోనే ఈవో సురేష్ బాబు బదిలీ అవుతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి.

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే