AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఒకప్పుడు ఊరి మధ్యలో ఉన్న అరుదైన ఆలయం.. ఇప్పుడు నీటి మధ్యలో చేరింది.. ఎలాగో తెలుసా?

400 ఏళ్ల చరిత్ర కలిగిన వరదవెల్లి గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయం నీటి మధ్యలోకి చేరిపోయింది. మిడ్ మానేరు కింద పూర్తిగా మునిగిపోయింది. దీంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సాహసం చేయాల్సి వస్తోంది.

Telangana: ఒకప్పుడు ఊరి మధ్యలో ఉన్న అరుదైన ఆలయం.. ఇప్పుడు నీటి మధ్యలో చేరింది.. ఎలాగో తెలుసా?
Dattatreya Swamy On Varadavelli Hill
G Sampath Kumar
| Edited By: |

Updated on: Dec 15, 2024 | 4:40 PM

Share

ప్రశాంతమైన వాతావరణం.. చుట్టూ నీరు.. కొండపైన స్వామి.. ఆ స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. అయితే ఎక్కడికి వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఈ దేవుడు చుట్టూ నీరు.. స్వామి వారిని దర్శించుకోవాలంటే బోట్ ఎక్కాల్సిందే..! ఒకప్పుడు గ్రామం మధ్యలో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు నీటి మధ్యలో ఉంది. ఎందుకు ఈ ఆలయం.. నీటి మధ్యలో ఉండే ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం..!

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో కొండపై స్వయంభు వెలిశారు దత్తాత్రేయ స్వామి. 400 ఏళ్ల క్రితం స్వయంభుగా వెలిశారని స్థానికులు చెబుతున్నారు. ఈ అలయానికి ఎంతో చరిత్ర ఉంది. రాహు కేతు శైన అవతారంలో స్వామి వారు దర్శనం ఇస్తున్నారు. ఇలాంటి ఆలయాలు భారత దేశంలో అరుదుగా ఉంటాయి. స్వామి వారు నిద్రించిన విగ్రహంలా ఉంటుంది. పూర్తిగా పడుకుని ఉంటారు. స్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తుంటారు.

వరదవెల్లి గ్రామంలో ఆలయం ఉంది. ఇక్కడ అందరూ వ్యవసాయం చేసుకుని జీవిస్తుంటారు. స్థానికులతో ఇతర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ గ్రామం మిడ్ మానేరు కింద పూర్తిగా మునిగిపోయింది. దాంతో గ్రామం తోపాటు భూములన్నీ ముంపునకు గురయ్యాయి. స్వామి వారు కొండపైన కొలువై ఉండటంతో ముంపు నుంచి బయటపడ్డారు. ఆలయం చుట్టూ నీరు ఉండటంతో భక్తులు స్వామివారిని దర్శించుకోలేకపోయారు. ఎప్పుడైన నీరు తగ్గినప్పుడు స్వామి వారిని దర్శించుకునే వారు.

అయితే.. ఇప్పుడు నీరు మొత్తం ఆలయం చుట్టూ చేరడంతో భక్తులు వెళ్ళని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం మూడు ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసింది. బోట్ ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు భక్తులు. కాస్తా.. భయం అన్పించినా.. స్వామి వారిని తలుచుకుంటూ దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సిద్ధమవుతోంది. అయితే..ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తే.. స్వామి వారి దర్శనంకు ఎలాంటి ఆటంకాలు ఉండవని అంటున్నారు భక్తులు.

బోట్ ద్వారా వెళ్ళి స్వామి వారిని దర్శించుకుంటున్నామని భక్తులు చెబుతున్నారు. నీటి భయం అన్పించిన స్వామి వారిని గుర్తు చేసుకుంటా వెళ్తున్నామని చెబుతున్నారు. ఓ వైపు ప్రకృతి.. మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం ఆకట్టుకుంటుందని తెలుపుతున్నారు. ఇలాంటి ఆలయం దేశంలో ఎక్కడ ఉండదని పురోహితులు అంటున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…