Dhanteras 2022: ధన్‌తేరాస్‌ రోజున బియ్యంతో ఇలా చేయండి.. అదృష్ట దేవత పలకరిస్తుంది.. అంతేకాదు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు..

ధన్‌తేరస్ రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పద్దతులను తీసుకుంటారు. ఈ చర్యలకు సంతసించిన లక్ష్మీదేవి భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తుందని నమ్ముతారు.

Dhanteras 2022: ధన్‌తేరాస్‌ రోజున బియ్యంతో ఇలా చేయండి.. అదృష్ట దేవత పలకరిస్తుంది.. అంతేకాదు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు..
Dhanteras
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 19, 2022 | 9:23 PM

ధన్‌తేరస్ పండుగను అక్టోబర్ 23 ఆదివారం జరుపుకోనున్నారు. దీపావళి ధన్తేరస్ రోజు నుంచి మొదలవుతుంది. ధన్‌తేరస్‌లో ఇత్తడి, వెండి పాత్రలను కొనుగోలు చేసే సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి ఉంది. ఈ రోజున పాత్రలను కొనుగోలు చేయడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ధన్తేరస్ రోజున, సాయంత్రం యమ దేవుడికి దీపాన్ని దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల మృత్యుదేవుడు యముడి నుంచి యమ భీతి తొలుగుతుందని నమ్ముతారు. ధంతేరస్ రోజున తీసుకునే కొన్ని చర్యలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అన్నం పరిహారంగా చెప్పవచ్చు. దాని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ధన్‌తేరస్‌లో బియ్యం గింజలతో..

  1. ధంతేరస్ రోజున బియ్యం గింజలతో చాలా ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున లక్ష్మీ, గణేషుడిని, కుబేరుడిని పూజించండి. 21 బియ్యం గింజలతో పూజించండి. ఆ తర్వాత వాటిని ఎర్రటి గుడ్డలో చుట్టి మీ ఖజానాలో లేదా మీరు  డబ్బును దాచుకునే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం వస్తుంది.
  2. ధంతేరస్ రోజున పూజ చేసిన తర్వాత ఇంటి సభ్యులందరూ నుదుటిపై తిలకం పెట్టుకోవాలి. ఈ తిలకంలో పగలని బియ్యాన్ని వాడడం వల్ల అదృష్టం కలుగుతుంది. 
  3. ధంతేరస్ రోజు ఉదయాన్నే రాగి పాత్రలో కొన్ని నీటిని.. కొద్దిగా అక్షింతలు కలిపి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం పలకరిస్తుంది. ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయని నమ్ముతారు.
  4. ఈ రోజున శివుడికి 5 బియ్యపు గింజలు సమర్పించడం ద్వారా భోలేనాథ్ సంతోషిస్తాడని చాలా మంది విశ్వసిస్తుంటారు. ధంతేరస్ రోజున శివునికి అన్నంతో చేసిన పాయసాన్ని  నైవేద్యంగా సమర్పించడం వలన ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
  5. మీ జాతకంలో చంద్రుని స్థానం బలహీనంగా ఉండి, మీరు ఎల్లప్పుడూ మానసికంగా ఇబ్బంది పడుతుంటే, ధన్తేరస్ రోజున ఒక పిడికెడు అన్నం దానం చేయండి. ఇలా చేయడం వల్ల చంద్రుడు బలవంతుడు అవుతాడు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం