Sabarimala: శబరిమలకు భారీగా భక్తజనం.. క్యూలైన్లో లక్షమందికి పైగా భక్తులు.. దర్శనానికి 10 గంటలు..
కేరళ సుప్రసిద్ధ ఆలయం శబరిమలకు భక్తజన సందోహం భారీగా పోటెత్తుతున్నారు. మకర జ్యోతి సమీపిస్తుండగా.. భక్తులు పెద్ద ఎత్తున స్వామి దర్శనానికై వస్తున్నారు.
కేరళ సుప్రసిద్ధ ఆలయం శబరిమలకు భక్తజన సందోహం భారీగా పోటెత్తుతున్నారు. మకర జ్యోతి సమీపిస్తుండగా.. భక్తులు పెద్ద ఎత్తున స్వామి దర్శనానికై వస్తున్నారు. మకర విళక్కు సందర్భంగా.. ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలని ట్రావన్ కోర్ దేవస్వం బోర్డును కోరింది కేరళ హైకోర్టు.
కొత్త ఏడాది ప్రారంభం నుంచీ శబరిమల అయ్యప్ప దర్శనార్ధమై భారీగా వస్తున్నారు భక్తజనులు. అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోతున్నాయి శబరి గిరులు. నానాటికీ రద్దీ పెరిగిపోతుండటంతో.. క్యూ లైన్ల నిండా భక్తజన సందోహం పోటెత్తి కనిపిస్తోంది. దర్శనానికై పది గంటల సమయం పడుతోంది. రోజుకు లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకుంటున్నట్టు అంచనా. ఇక వారం రోజుల్లో మకర విళక్కు ఉండటంతో.. భక్తుల అవసరాలను తీర్చేలా ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డును కోరింది కేరళ హైకోర్ట్ డివిజన్ బెంచ్.
ఈ అంశంపై స్పందించిన బోర్డు.. భారీ ఎత్తున అన్నదానం ఏర్పాట్లు చేశామనీ. వచ్చే రోజుల్లో పెద్దపాదం నడిచే యాత్రికులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. వారి కోసం సకల సదుపాయాలను అందుబాటులో ఉంచామనీ. నీలక్కల్- పంబ మధ్య సాగే రవాణా సైతం తగిన విధంగా సిద్ధం చేశామని కోర్టుకు తెలిపింది ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు. అంతే కాదు.. రెండేళ్ల తర్వాత భక్తులు విస్తృత స్థాయిలో వస్తుండటంతో.. తొక్కిసలాటలు జరిగే ప్రమాదముంది. కాబట్టి ఎవ్వరూ తొందర పడవద్దనీ. ఎక్కడి వారు అక్కడి ఉండి.. వ్యూ పాయింట్స్ ద్వారా.. మకర జ్యోతి దర్శనం చేయాలని సూచించింది కేరళ ప్రభుత్వం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..