Srisailam: భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో ఫిబ్రవరి 11నుంచి బ్రహ్మోత్సవాలు.. అధికారుల ముమ్మర ఏర్పాట్లు..

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థాన సిబ్బంది స్థానిక తహసీల్దార్,...

Srisailam: భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో ఫిబ్రవరి 11నుంచి బ్రహ్మోత్సవాలు.. అధికారుల ముమ్మర ఏర్పాట్లు..
Srisailam
Follow us

|

Updated on: Jan 07, 2023 | 8:32 PM

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థాన సిబ్బంది స్థానిక తహసీల్దార్, వైద్య, పోలీస్ అధికారులతో ఈవో లవన్న ప్రాథమిక సమావేశం నిర్వహించారు. 11 రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు భీమునికొలను కైలాసద్వారంలో అటవీశాఖ సహకారంతో ఆయా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కు గత సంవత్సరం కంటే ఎక్కువగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

భక్తులకు తాత్కాలిక వసతి, తాగునీరు, విశ్రాంతి, షామియానాలు ఏర్పాట్లు చేయాలి. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. శ్రీశైలం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో పౌర్ణమి ప్రత్యేక వేడుకలు నిర్వహించాం. లోక కళ్యాణార్ధం పరివార దేవతలకు అర్చనలు అభిషేకాలు ఘనంగా జరిపించాం. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇష్ట దైవాన్ని సందర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

          – లవన్న, శ్రీశైలం దేవస్థానం ఈవో

ఇవి కూడా చదవండి

మరోవైపు.. నిన్న (శుక్రవారం) సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో ఆలయ ప్రాకారంలో క్షేత్ర గిరి ప్రదక్షిణ చేశారు. అర్చక వేదపండితులు భక్తులు శివనామస్మరణ చేశారు. నందిమండపం నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం మీదుగా శివనామస్మరణ చేస్తూ సాగిన గిరిప్రదక్షిణలో భ‌క్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. త‌ర్వాత‌ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచెంబు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు ఉత్సవం జరిపించారు. శివ నామ స్మరణతో శ్రీశైలం గిరులు మార్మోగాయి.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి