Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: లక్ష్మీదేవి చంచలం.. ఈ విధంగా సంపాదిస్తే… ఆ వ్యక్తి జీవితం నాశనం అంటున్న చాణక్య

చాణక్యుడి విధానం ప్రకారం.. కొన్ని రకాలుగా సంపాదించే డబ్బులు ఆ వ్యక్తి వద్ద నిలబడవు.. అంతేకాదు ఆ మనిషి జీవితాన్ని నాశనం చేయడం ఖాయమని తెలిపాడు. 

Chanakya Niti: లక్ష్మీదేవి చంచలం.. ఈ విధంగా సంపాదిస్తే... ఆ వ్యక్తి జీవితం నాశనం అంటున్న చాణక్య
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2023 | 5:45 PM

ఆచార్య చాణక్యుడు మంచి ఆర్థికవేత్త మాత్రమే కాదు..మంచి ఉపాధ్యాయుడు. నైపుణ్యం కలిగిన దౌత్యవేత్త కూడా. చాణక్యుడి విధానాలు నేటికీ మానవులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలు.. విధానాలను ఆచరించడం  ద్వారా.. ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తప్పుగా సంపాదించిన డబ్బు మనిషితో ఎక్కువ కాలం ఉండదని పేర్కొన్నాడు. చాణక్యుడి విధానం ప్రకారం.. కొన్ని రకాలుగా సంపాదించే డబ్బులు ఆ వ్యక్తి వద్ద నిలబడవు.. అంతేకాదు ఆ మనిషి జీవితాన్ని నాశనం చేయడం ఖాయమని తెలిపాడు.

 ఏ విధంగా సంపాదించిన డబ్బు వృధా అవుతుందంటే.. 

  1. ఆచార్య చాణక్యుడు లక్ష్మీదేవి  చంచలమైనదని చెప్పాడు. అటువంటి పరిస్థితిలో.. ఒక వ్యక్తి దొంగతనం, జూదం, అన్యాయం,  మోసం చేసి డబ్బు సంపాదిస్తే.. ఆ డబ్బు ఆ వ్యక్తి వద్ద నిలబడదు. అంతేకాదు వ్యక్తి జీవితం త్వరగా నాశనం అవుతుంది.
  2. పేదరికం, వ్యాధి, దుఃఖం, బానిసత్వం, చెడు అలవాట్లు, ఇవన్నీ మనిషి కర్మల ఫలితమే. చాణక్య నీతి ప్రకారం.. ఏ వ్యక్తి ఏ విత్తనం నాటితే.. అదే ఫలాన్ని పొందుతాడు.
  3. ఇవి కూడా చదవండి
  4. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఏ వ్యక్తిని ఎప్పుడూ డబ్బు లేని వ్యక్తిగా పరిగణించకూడదు. ఒక వ్యక్తి అజ్ఞానం వల్ల అధమంగా ఉంటాడే తప్ప సంపద లేక పోవడం వలన మాత్రం కాదు.
  5. విజ్ఞానం, తెలివి తేటలు లేని వ్యక్తి ఎన్ని రకాల సుఖాలున్నా.. సంపదలున్నా అల్పుడు అవుతాడు. అందుకే ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదు.
  6. చాణక్య విధానం ప్రకారం..  ఏ వ్యక్తి అయినా ఇతరుల మనసుని గాయపరిచి డబ్బు సంపాదించకూడదు. ఎదుటివారిని కన్నీరు పెట్టి సంపాదించిన సంపద త్వరలో నాశనం అవుతుంది.
  7. చాణక్యుడి ప్రకారం.. డబ్బు సంపాదించడానికి ఎవరినీ హింసించకూడదు.. గాయపరచకూడదు. ఈ విధంగా సంపాదించిన డబ్బు  ఆ వ్యక్తి వద్ద ఎప్పటికీ నిలవదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు
వరుసగా 4వ ఓటమి.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ ఔట్
వరుసగా 4వ ఓటమి.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ ఔట్
అద్భుతాలు చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌.. మూడేళ్లలో ధనవంతులు!
అద్భుతాలు చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌.. మూడేళ్లలో ధనవంతులు!
గుడ్‌ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
గుడ్‌ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
రోహిత్, బుమ్రా రీఎంట్రీ.. బెంగళూరుపై విజయం పక్కా?
రోహిత్, బుమ్రా రీఎంట్రీ.. బెంగళూరుపై విజయం పక్కా?
Horoscope Today: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
Horoscope Today: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..