Numerology: మీ స్వభావం పుట్టిన తేదీని బట్టి తెలుస్తుంది.. ఏ ర్యాడిక్స్ వారికీ ఏ తేదీ, ఏ రంగు లక్కీ అంటే

సంఖ్యాశాస్త్రంలో అంకెలు 1 నుంచి 9 వరకు ఉంటాయి. మీ రాడిక్స్ మీ లక్షణాలు, స్వభావం గురించి కూడా చెబుతుంది. అటువంటి పరిస్థితిలో... ర్యాడిక్స్ అంటే ఏమిటి..  న్యూమరాలజీ ప్రకారం ఏ సంఖ్య కలిగిన వారు ఏ స్వభావాన్ని కలిగి ఉంటారు.. ఏ రంగు, రోజు వీరికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.

Numerology: మీ స్వభావం పుట్టిన తేదీని బట్టి తెలుస్తుంది.. ఏ ర్యాడిక్స్ వారికీ ఏ తేదీ, ఏ రంగు లక్కీ అంటే
Numerology Lucky Color
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2023 | 3:40 PM

జ్యోతిష్యశాస్త్రాన్ని , హస్త సాముద్రికంతో ఏ విధంగా తమ భవిష్యత్ ను తెలుసుకుంటారో.. అదే విధంగా న్యూమరాలజీని కూడా ఆశ్రయిస్తాయి. మానవ జాతకంలో రాశి, గ్రహాలు, నక్షత్రాలు, మనిషి జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తాయో.. అదే విధంగా పుట్టిన తేదీ కూడా చేస్తుందని న్యూమరాలజీని నమ్మేవారు విశ్వసిస్తారు. సంఖ్యాశాస్త్రంలో అంకెలు 1 నుంచి 9 వరకు ఉంటాయి. మీ రాడిక్స్ మీ లక్షణాలు, స్వభావం గురించి కూడా చెబుతుంది. అటువంటి పరిస్థితిలో… రాడిక్స్ అంటే ఏమిటి..  న్యూమరాలజీ ప్రకారం ఏ సంఖ్య కలిగిన వారు ఏ స్వభావాన్ని కలిగి ఉంటారు.. ఏ రంగు, రోజు వీరికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.

రాడిక్స్ అంటే ఏమిటి మీరు పుట్టిన తేదీని రాడిక్స్ అంటారు. సాధారణంగా.. మొత్తం రాడిక్స్ 1 నుండి 9 వరకు ఉంటుంది.  అంటే.. మీరు ఏదైనా నెలలో ఈ తేదీలలో జన్మించినట్లయితే.. ఆ తేదీ మీ రాడిక్స్ గా పరిగణిస్తారు. అయితే  మీ పుట్టిన తేదీ రెండు అంకెలలో ఉంటే..  రాడిక్స్ పొందడానికి రెండు సంఖ్యలను జోడించడం ద్వారా వచ్చే సంఖ్య మీ రాడిక్స్‌గా పరిగణించబడుతుంది. ఉదాహరణకు.. మీరు 23వ తేదీన జన్మించినట్లయితే, అప్పుడు 2+3 = 5, అంటే మీ సంఖ్య 5.

న్యూమరాలజీ నం. 1 రాడిక్స్ నంబర్ 1 ఉన్న వ్యక్తులు మంచి నాయకత్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరి స్వభావం వినయంగా .. సరళంగా ఉంటుంది.01, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు 1వ రాడిక్స్ కు చెందినవారు. ఈ తేదీలలో చేసే ఏదైనా పని మీకు ఫలవంతంగా ఉంటుంది.  వీరు అధిక  ఖర్చు చేసే స్వభావం కలిగి ఉంటారు. డబ్బు ఖర్చుపెట్టే సమయంలో ఆదాయాన్ని కూడా పట్టించుకోరు. రాడిక్స్ 1తో సంబంధం ఉన్న వ్యక్తులకు పసుపు రంగు శుభప్రదం.

ఇవి కూడా చదవండి

న్యూమరాలజీ నం. 2 సంఖ్య 02 వ్యక్తుల స్వభావం కొబ్బరికాయ లాంటిది. అంటే పై నుండి గట్టిగా ..లోపల నుండి చాలా మృదువుగా ఉంటుంది. అతను ఎల్లప్పుడూ తన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అండగా ఉంటాడు. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. ఆదివారం, సోమవారం, శుక్రవారాలు రాడిక్స్ 02 సంఖ్య ఉన్నవారికి అనుకూలమైన రోజులు. సోమవారం 2, 11, 20, 29 లతో పాటు 7, 16, 25 తేదీలలో వస్తే.. అది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రాడిక్స్ 2వ సంఖ్య కలిగిన వ్యక్తులు తమ ముందు ఇతరులు చెప్పేవాటిని తరచుగా పట్టించుకోరు. దీంతో జీవితంలో చాలాసార్లు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

న్యూమరాలజీ నం. 3 న్యూమరాలజీ ప్రకారం.. రాడిక్స్ 3వ సంఖ్యతో సంబంధం ఉన్న వ్యక్తులు మతపరమైనవారు, మేధావులు , ప్రతిభావంతులు. వీరు ఎవరి మాటలను అంత తేలికగా తీసుకోరు. ఈ రాడిక్స్ వారు అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెలలో 3వ, 12వ, 21వ, 30వ తేదీలలో జన్మించిన వ్యక్తికి రాడిక్స్ సంఖ్య 3 ఉంటుంది.

న్యూమరాలజీ నం. 4 సంఖ్యాశాస్త్రం ప్రకారం, 4, 13, 22, 31 తేదీలు రాడిక్స్ 4వ సంఖ్య ఉన్నవారికి శుభప్రదం. రాడిక్స్ 04 ఉన్నవారికి సోమ, శని, ఆదివారాలు చాలా శ్రేయస్కరం. రాడిక్స్ 04 స్వభావం రీత్యా తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు. వీరు తమ స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేయడానికి ఎప్పుడూ వెనుకాడరు. వీరికి మంగళకరమైన రంగులు నీలం, కాషాయ ఎరుపు, కుంకుమ.

న్యూమరాలజీ నం. 5 రాడిక్స్ 05 ఉన్న వ్యక్తులు తమ పనిని ఎదో విధంగా ఎలాగైనా పూర్తి చేయించుకోవడంలో నిపుణులు. సహజంగానే వీరు కాస్త స్వార్థపరులు. బుధ, శుక్ర, శనివారాలు వీరికి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. మరోవైపు ఈ వ్యక్తులకు 4, 14, 23 తేదీలు శుభప్రదం.

న్యూమరాలజీ నం. 6 రాడిక్స్ 6 ఉన్న చాలా మంది వ్యక్తులు చూడటానికి అందంగా.. ఆకర్షణీయంగా ఉంటారు. శారీరకంగా ఈ వ్యక్తులు ఫిట్‌గా ఉంటారు. వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పుట్టిన తేదీ 06, 6, 15 , 24 వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. వీరు జీవితానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే..  ఈ తేదీలను మాత్రమే ఎంచుకోండి. రాడిక్స్ 06 ఉన్న వ్యక్తులకు లేత లేదా ముదురు నీలం, గులాబీ లేదా ఎరుపు రంగు శుభప్రదం.

న్యూమరాలజీ నం. 7 రాడిక్స్ 07 కలిగిన వ్యక్తులు మంచి ఆలోచనలు చేస్తారు. ఈ వ్యక్తులు ఎవరినైనా కలవడం ద్వారా లేదా నిర్దిష్ట పరిస్థితిని చూడటం ద్వారా భవిష్యత్ గురించి మంచి ఆలోచనను చేస్తారు. రాడిక్స్ 07 ఉన్న వారు సోమవారం, ఆదివారాలు శుభ దినాలు. రాడిక్స్ 7వ సంఖ్య ఉన్న వారికి 7, 16, 25 తేదీలు ఎల్లప్పుడూ శుభప్రదమైనవి.

న్యూమరాలజీ నం. 8 రాడిక్స్ 8 ఉన్న మంది వ్యక్తులు చాలా ప్రభావవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ఏ విషయంలో నైనా లోతుగా ఆలోచిస్తారు. ఆ విషయానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ఇష్టం. వీరు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే.. దానిని తప్పని సరిగా చేస్తారు. ఈ వ్యక్తులు తమ పనిని నెల 8, 17 లేదా 26 తేదీల్లో చేయాలి. దీని వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

న్యూమరాలజీ నం. 9 రాడిక్స్ 09 ఉన్న వ్యక్తులు విపరీతమైన కోపాన్ని కలిగి ఉంటారు. ఇతరుల మాట వినకుండా తమ కోపాన్ని వ్యక్తం చేస్తారు. అయితే ఈ వ్యక్తులు ఆలోచనలో, స్వభావంలో చాలా స్వతంత్రంగా ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం, ఎరుపు, గులాబీ, మెజెంటా, లేత మెరూన్, కుంకుమ, లేత పసుపు రంగులు 9, 18 లేదా 27 తేదీలలో జన్మించిన వారికి శుభప్రదంగా పరిగణించబడతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)