AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hangseshwari Temple: మోడీ దర్శించుకోనున్న హంగేశ్వరి ఆలయం.. శివ శక్తి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే..?

పశ్చిమ బెంగాల్‌లో దుర్గామాతను శక్తి స్వరూపిణిగా అత్యంత వైభవంగా పూజిస్తారు. అంతే కాకుండా ఇక్కడ జరుపుకునే దసరా పండుగ కూడా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారి ఆలయం కలకత్తా నుండి 50 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ జిల్లాలోని బన్సి బెరియాలో ఉంది. ఈ ఆలయ నిర్మాణ పనులను నృసింహదేబ్ రాయ్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన భార్య రాణి శంకరి ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేశారు.

Hangseshwari Temple: మోడీ దర్శించుకోనున్న హంగేశ్వరి ఆలయం.. శివ శక్తి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే..?
Hangseshwari Temple
Surya Kala
|

Updated on: Mar 02, 2024 | 6:58 AM

Share

భారతదేశంలో విభిన్నమైన పౌరాణిక ప్రదేశాలు, అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. భారతదేశంలోని ప్రతి ఆలయానికి కొన్ని కథలు లేదా ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఇతర దేవాలయాల కంటే భిన్నంగా ఉంటూ భక్తులతో పూజలను అందుకుంటాయి. అలాంటి ఆలయాలలో ఒకటి పశ్చిమ బెంగాల్‌లోని హంగేశ్వరి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రధాని మోడీ తన రెండు రోజుల పర్యటన సందర్భంగా సందర్శించనున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో దుర్గామాతను శక్తి స్వరూపిణిగా అత్యంత వైభవంగా పూజిస్తారు. అంతే కాకుండా ఇక్కడ జరుపుకునే దసరా పండుగ కూడా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారి ఆలయం కలకత్తా నుండి 50 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ జిల్లాలోని బన్సి బెరియాలో ఉంది. ఈ ఆలయ నిర్మాణ పనులను నృసింహదేబ్ రాయ్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన భార్య రాణి శంకరి ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేశారు.

19వ శతాబ్దపు వాస్తుశిల్పం

హంగేశ్వరి ఆలయాన్ని హంసేశ్వరి ఆలయం అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఈ ఆలయం కాళీ మాతకు కూడా అంకితం చేయబడింది. ఈ ఆలయం 19వ శతాబ్దపు శిల్పకళను ప్రతిబింబిస్తూ నిర్మించబడింది. ఈ ఆలయం 21 మీటర్ల ఎత్తు, 13 మినార్లను కలిగి ఉంది. ప్రతి టవర్ శిఖరం తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. తాంత్రిక సూత్రాల ప్రకారం నిర్మించబడిన ఈ ఐదు అంతస్తుల ఆలయం మానవ శరీర నిర్మాణాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ నవరాత్రి రోజుల్లో ఋషులు, సాధువులు తంత్ర సాధన చేస్తారు. ఆలయంలోని ప్రతి స్తంభం పై భాగంలో కమలం వంటి ఆకారంలో నిర్మాణం ఉంటుంది. ఆలయం లోపల ఉన్న కళాఖండాలు మానవ జీవితంలోని వివిధ దశలను వర్ణిస్తాయి. హంగేశ్వరి ఆలయం పశ్చిమ బెంగాల్‌ లోని బన్షాబెరియాలో ఉంది.

ఇవి కూడా చదవండి

అమ్మవారి విగ్రహం ప్రత్యేకం

హంగేశ్వరి ఆలయం కాళీమాతకు అంకితం చేయబడింది. ఇతర దేవాలయాలలోని విగ్రహాల కంటే భిన్నమైన ఈ ఆలయ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. వాస్తవానికి ఈ విగ్రహం నీలి రంగు వేప చెక్కతో తయారు చేయబడింది. ఇది తామరపువ్వుపై ఉంచబడుతుంది. ఈ నిర్మాణం మొత్తం ఎత్తు 21 మీటర్ల వరకు ఉంటుంది.

శక్తితో ఉన్న శివుడు

ఈ ఆలయంలో శివుడు , శక్తి ఇద్దరూ ఉన్నారు. కనుక ఈ ఆలయాన్ని హంగేశ్వరి అని పిలుస్తారు. ఈ ఆరు త్రిభుజాకార గోళీలపై ఆలయం నిర్మించి ఉంది. శక్తి విగ్రహం నీలిరంగు వేప చెక్కతో చేయగా, శివుని శివలింగం తెల్లని పాలరాతితో చేయబడింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు