AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారా..! అయితే ఇది మీ కోసమే.. మే నెల మొత్తం ముహూర్తాలే..?

wedding Days in May Month : హిందూ మతంలో ఏదైనా శుభకార్యాలు చేసే ముందు మంచి ముహూర్తం చూసుకోవడం ఆనవాయితీ. వివాహం అనేది ఇద్దరు

పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారా..! అయితే ఇది మీ కోసమే.. మే నెల మొత్తం ముహూర్తాలే..?
Wedding Days
uppula Raju
|

Updated on: Apr 29, 2021 | 10:42 PM

Share

wedding Days in May Month : హిందూ మతంలో ఏదైనా శుభకార్యాలు చేసే ముందు మంచి ముహూర్తం చూసుకోవడం ఆనవాయితీ. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరుగుతుంది కానీ రెండు కుటుంబాలను కలుపుతుంది. అందువల్ల వివాహానికి సంబంధించి పవిత్రమైన పనులన్నీ శుభ గడియలలోనే చేస్తారు. వివాహం సందర్భంగా ఎలాంటి సమస్య తలెత్తకూడదని ఇలా చేస్తారు. అందువల్ల గ్రహాల కదలిక, వారి స్థితి గతులను అంచనా వేసి పెళ్లి తంతు పెట్టుకుంటారు.

ఈ ఏడాది వివాహం చేసుకోడానికి సిద్ధంగా ఉన్న యువతీ యువకులకు మౌఢ్యం బ్రేకులు వేసింది. దీంతో కొద్ది నెలలు వేచిచూడక తప్పలేదు. హిందూ క్యాలెండర్ ప్రకారం మే నెలలో పెళ్లిళ్లకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. వివాహ విషయాలలో గురు, బుధుడు ముఖ్యమైనవిగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం ఈ రెండు గ్రహాలు అనుకూలంగా లేకుంటే ఆ పెళ్లి జరగదు. మే నెలలో వివాహానికి మంచి రోజులు ఇలా ఉన్నాయి.. మే 2, 4,7, 8, 21, 22, 23, 24, 26, 29, 31 తేదీలు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు.

వాస్తవానికి పెళ్లిళ్లకు మాఘమాసం మంచిదంటారు. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసంగా పరిగణిస్తారు. ఉత్తరాయణం మొదలైన తర్వాత వచ్చే మాఘమాసం పుణ్యకార్యాలకు శుభప్రదమైంది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి నెలలో వస్తుంది. దీంతో ఫిబ్రవరిలో ఏటా లక్షలాది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతాయి. అనేక మంది గృహప్రవేశాలకు ఇదే మంచి కాలమని భావిస్తారు. కానీ, ఈ ఏడాది శుక్రమౌఢ్యమి కారణంగా ఫిబ్రవరిలో శుభ ముహూర్తాలు లేవని పండితులు పేర్కొన్నారు. శూన్యమాసం ఫిబ్రవరి 12తో ముగుస్తుంది.. కానీ శుక్ర మౌఢ్యమి ఫిబ్రవరి 14న ప్రారంభమై 80 రోజులు ఉంటుంది.. ఈ సమయంలో వివాహాలు జరిపిస్తే చెడు ఫలితాలు ఉంటాయి.. అందుకే మే నెలలో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.

Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోమారు కరోనా పరీక్షలు.. ఎందుకంటే..!

తమిళనాడులో డీఎంకేకి అధికార పగ్గాలు ? బెంగాల్ లో దీదీ, కేరళలో లెఫ్ట్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు