Unique Temple: ఈ ఆలయం దైర్యానికి చిహ్నం.. ఉల్లిపాయలు, పప్పులే స్వామికి ప్రసాదం..
హిందూ దేవాలయాలలో సాధారణంగా పువ్వులు, కొబ్బరికాయలు, స్వీట్లు, పండ్లు, పాలు ప్రసాదంగా సమర్పించే సంప్రదాయం ఉంది. అయితే ఒక దేవాలయంలో ఉల్లిపాయలు, పప్పులను ప్రసాదంగా స్వామికి నైవేద్యంగా సమర్పించే సాంప్రదాయం ఉంది? మన దేశంలో ఎక్కడ ఉంది? ఆ ఆలయం పేరు? ఈ ప్రత్యేకమైన సంప్రదాయం గురించి తెలుసుకుందాం.

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఉన్న గోగమేడి ఆలయం ఒక ప్రత్యేల ఆలయం. ఇక్కడ ఉల్లిపాయలు, పప్పులను ప్రసాదంగా పంచే ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఈ ఆలయం సుమారు 950 సంవత్సరాల పురాతనమైనది. జానపద దేవత గోగాజీకి అంకితం చేయబడింది. సాధారణంగా ఉల్లిపాయలను తామసిక ఆహారంగా పరిగణిస్తారు. కనుక ఉల్లిని ఏ ఆలయంలోనూ ప్రసాదంగా పంచిపెట్టరు. అయితే ఈ సంప్రదాయం గోగమేడి ఆలయంలో సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇక్కడ నైవేద్యంగా సమర్పించే ఉల్లిపాయల కుప్పలు ఏడాది పొడవునా ఉంటాయి. ఈ ఆలయం దీని ప్రత్యేక నైవేద్యాల కారణంగా నేటికీ భక్తుల విశ్వాస కేంద్రంగా ఉంది.
గోగమేడి ఆలయం ఎందుకు ప్రత్యేకమైనది? గోగామేడిని గోగాజీ నివాసం అని పిలుస్తారు. గోగాజీని జహర్‌వీర్ గోగాజీ లేదా గోగా వీర్ అని కూడా పిలుస్తారు. ఆయనను సర్పాల దేవుడిగా భావిస్తారు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు గోగాజీని పూజిస్తారు. చాలా హిందూ దేవాలయాలలో ఉల్లిపాయ, వెల్లుల్లి తామసిక హారం అని వీటిని ఉపయోగించడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. అయితే గోగామేడి ఆలయం దీనికి మినహాయింపు. ఇక్కడ ఉల్లిపాయ, పప్పుధాన్యాలు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడాది పొడవునా ఆలయ ప్రాంగణంలో ఉల్లిపాయల కుప్పలు కప్పులుగా ఉంటాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఉల్లిపాయలను తరువాత అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఆలయంలోని భండార, గోశాల నిర్వహణకు ఉపయోగిస్తారు.
సంప్రదాయం, గుర్తింపు గోగమేడిని సందర్శించే భక్తులు ముందుగా గోరఖ్ గంగాలో స్నానం చేయాలి. ఆ తర్వాత అదే పవిత్ర జలంతో ఖీర్ ని తయారు చేయాలి. ఆ తర్వాత భక్తులు గోరఖ్ తిలా చేరుకుని ఉల్లిపాయ, పప్పు ప్రసాదాన్ని అందిస్తారు. ఆలయంలో ఉల్లిపాయ, పప్పులతో పాటు ఉప్పగా చేసిన బియ్యం, బటాషాను అందించే సంప్రదాయం కూడా ఉంది. గోగాజీకి నిర్మలమైన హృదయంతో ఉల్లిపాయను సమర్పించడం ద్వారా, భక్తుడి కోరికలన్నీ నెరవేరుతాయని, కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు.
ఆలయ చారిత్రక ప్రాముఖ్యత ఈ ఆలయం దీని ప్రత్యేకమైన సంప్రదాయంతో ప్రసిద్ధి చెందడమే కాదు గోగాజీ ధైర్యం.. ప్రజా సేవపై విశ్వాసానికి చిహ్నంగా కూడా ఉంది. గోగామేడి ఆలయం సుమారు 950 సంవత్సరాల క్రితం స్థాపించబడిందని నమ్ముతారు. గోగాజీ నాగ రాజవంశానికి చెందిన గొప్ప యోధుడు. సమాజం,హిందూ మతాన్ని రక్షించడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడని నమ్ముతారు. ఈ కారణంగా అతనికి జహర్‌వీర్ అనే బిరుదు ఇవ్వబడింది. ప్రతి సంవత్సరం, దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు గోగామేడి ఉత్సవాన్ని సందర్శించడానికి వస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








