- Telugu News Photo Gallery According to Vastu, these items should be kept in the house to increase luck and wealth
వాస్తు : ఇంట్లో అదృష్టం, డబ్బు కలగాలంటే, పాటించాల్సిన వాస్తు టిప్స్ ఇవే!
జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. ప్రతి రోజూ కొన్ని వాస్తు నియమాలు పాటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అయితే వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం, కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వలన అదృష్టం కలగడమే కాకుండా, డబ్బు కొరత సమస్య ఉండదంట. కాగా, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Updated on: Aug 30, 2025 | 11:49 AM

లాఫింగ్ బుద్ధ: ఇంటిలో ఎప్పుడూ ఆనందకర వాతావరణం చోటు చేసుకోవాలి. అదృష్టం కలగాలంటే తప్పకుండా లాఫింగ్ బుద్ధను ఇంటిలో ఉంచుకోవాలంట. దీని వలన శ్రేయస్సు, సానుకూల శక్తి పెరుగుతుందంట. దీనిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.

తాబేలు: మీ ఇంటిలోపల తాబేలును లేదా తాబేలు విగ్రహాలను పెట్టుకోవడం వలన సంపద పెరుగుతుందంట. ఇది సంపదకు, స్థిరత్వాన్ని చిహ్నం. వాస్తు శాస్త్రం ప్రాకారం, ఇంట్లో తాబేలును ఉంచుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. అయితే దీనిని ఉత్తర దిశలో ఉంచడం వలన అన్ని విధాల కలిసి వస్తుందంట.

వెదురు మొక్క: ఇంటిలోని ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, డబ్బు నిలవాలి అంటే తప్పకుండా, ఇంటిలోపల వెదురు మొక్క పెట్టాలి అంటారు పండితులు. ఎందుకంటే, ఇది అదృష్టానికి చిహ్నం, అందువలన ఈ మొక్కను లివింగ్ రూమ్‌లో ఆగ్నేయ దిశలో ఉంచడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట.

తులసి మొక్క : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోపల తులసి మొక్కను పెట్టుకోవడం వలన ఇది ఇంటిలో ప్రతికూల శక్తిని తొలిగించి, సానుకూల శక్తిని పెంపొందిస్తుందంట. అలాగే ఇది ఎప్పుడూ ఇంటి ప్రాంగణంలో ఈశాన్యం లేదా తూర్పు దిశలో పెట్టడం చాలా మంచిదంట.

చేపల అక్వేరియం : ఇంట్లో అక్వేరియం ఉంచుకోవడం వల్ల ఇంటి వాతావరణం బాగుంటుంది . అలాగే ఇది ఇంట్లో సానుకూలతను పెంచుతుంది. చేపల కదలికలు జీవితంలో పురోగతి మరియు సంపద ప్రవాహాన్ని సూచిస్తాయి.



