చాణక్యనీతి : అత్తలకు సూచన..కొడుకు, కోడలితో ఈ విషయాల్లో జాగ్రత్త!
ఆ చార్య చాణక్యుడు కుటుంబాలు, బంధాలు బంధుత్వాల గురించి అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్నో విషయాల గురించి తెలియజేశాడు. అలాగే చాణక్యుడు తమ కొడుకుకు వివాహం జరిగిన తర్వాత కొడుకును, కోడలిని నమ్మేటప్పుడు కొన్ని విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. మరి ఆ విషయాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Aug 30, 2025 | 11:50 AM

ఆ చార్య చాణక్యుడు కుటుంబాలు, బంధాలు బంధుత్వాల గురించి అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్నో విషయాల గురించి తెలియజేశాడు. అలాగే చాణక్యుడు తమ కొడుకుకు వివాహం జరిగిన తర్వాత కొడుకును, కోడలిని నమ్మేటప్పుడు కొన్ని విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. మరి ఆ విషయాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

చాణక్యడు గొప్ప పండితుడు, తత్వవేత్త. ఈయన అనేక అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. చాణక్యుడు తన అనుభవాల ఆధారంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా ఈ తరం వారికి ఎన్నో సూచనలివ్వడం జరిగింది. అలాగే ఆయన కొన్ని బంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా అత్తగా మారిన తర్వాత కొడుకు , కోడలు విషయంలో చేసే ఈ చిన్న తప్పులే, భవిష్యత్తులో సమస్యలను తీసుకొస్తాయంట.

చాణక్యుడు మాట్లాడుతూ, కొడుకు వివాహం తర్వాత లేదా కాస్త పెద్ద అయ్యి కుటుంబ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత నిర్ణయాలు తీసుకోవడం చేస్తాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కొడుకు కోరికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. ఎందుకంటే? తాను తీసుకునే నిర్ణయాలు కొన్ని సార్లు సమస్యలను తీసుకరావచ్చును, తల్లిదండ్రుల గుడ్డి నమ్మకం, పెద్ద ఇబ్బందులకు కారణం అవుతుంది. అందుకే కొడుకుపై ఎప్పుడూ ప్రేమను చూపెట్టాలి కానీ, అతిగా, గుడ్డి నమ్మకం పెట్టుకోకూడదంట.

కోడలి ప్రవర్తనలో మార్పు గమనించినట్లైతే అస్సలే ఆమెను విస్మరించకూడదంట. ఇంటి కోడలు ప్రవర్తన కుటుంబ శాంతి, ఆనందాన్ని ప్రత్యేక్షంగా ప్రభావితం చేస్తుంది. అయితే మీరు గనుక మీ కోడలి ప్రవర్తనలో మార్పు గమనిస్తే, ఎట్టి పరిస్థితుల్లో ఆమెను నమ్మకూడదని చెబుతున్నారు . అలాగే ప్రతి పరిస్థితుల్లోనూ సంయమనం పాటించాలని ఆయన చెబుతున్నాడు.

అలాగే ఎంత మీ కొడుకు అయినా సరే మీ డబ్బు రహస్యాలను, ఆస్తి వ్యవహారాలను అస్సలే వెల్లడించకూడదంట. ముఖ్యంగా కుటుంబ భద్రత, భవిష్యత్తు బలానికి సంబంధించనవి, కొడుకు , కోడలైనా, నమ్మకమైన వారితో కూడా పూర్తిగా వెళ్లడించకూడదంట. వారు సరైన వారిగా ఉన్నారని మీకు అనిపించినప్పుడు, లేదా వారికి ప్రతి విషయం, ఆస్తి, డబ్బు వ్యవహారాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రమే కొడుకు కోడలికి ఈ బాధ్యతలు అప్పజెప్పాలంట.



