ఆకలి తీర్చుకుంటున్న ఒంటెని వేధించిన ఆకతాయిలు.. ఉగ్ర రూపం చూపించిన ఎడారి ఓడ.. వీడియో వైరల్
ఒక ఒంటె ప్రశాంతంగా చెట్టు కింద నిలబడి ఆకులను నమిలి తింటూ ఉంది. ఆ సమయంలో కొంతమంది అబ్బాయిలు ఎటువంటి కారణం లేకుండా ఆ ఒంటెని ఆటపట్టించారు. దీని తరువాత ఆ ఒంటెకు కోపం వచ్చి.. తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది. తరువాత ఏమి జరిగిందో.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీరే చూసి తెలుసుకోండి..

మూగ జీవులను అకారణంగా, అనవసరంగా వేధిస్తే ఏమి జరుగుతుందో చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది అబ్బాయిలు ఎటువంటి కారణం లేకుండా ప్రశాంతంగా ఉన్న ఒంటెను ఆటపట్టించడానికి ప్రయత్నించడాన్ని చూడవచ్చు. అయితే మరు క్షణంలో ఒంటె ఎవరూ ఊహించని విధంగా ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది. అబ్బాయిల పరిస్థితి గురించి చెప్పనలవి కాదు. ఈ వైరల్ వీడియోలో, ఒక ఒంటె ప్రశాంతంగా నిలబడి చెట్టు మీద ఉన్న పచ్చని ఆకులను తింటూ ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు కొంతమంది యువకుల బృందం ఆ ఒంటి వైపుకు దానిని వేధించడం ప్రారంభించింది. ఈ వీడియోలో ఒక యువకుడు ఒంటె నోటి దగ్గర.. ఒక చెట్టు కొమ్మతో దానిని వేధించడం మొదలు పెట్టారు.
అయితే తన పనికి అంతరాయం కలిగించిన యువకుడు చర్య ఒంటెకు అస్సలు నచ్చలేదు. అకస్మాత్తుగా కోపంగా మారింది. మరుసటి క్షణంలోనే.. ఎడారి ఓడ అక్కడ ఉన్న యువకులను వెంబడించడం మొదలు పెట్టింది. దీంతో ఆ యువకులు ఒంటెకి దొరకకుండా పారిపోయారు.
ఈ వీడియోలో ఒంటె ఆకస్మిక దాడి తర్వాత అందరు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తడం కనిపిస్తుంది. ఒంటె కూడా వారిని చాలా దూరం వెంబడిస్తుంది. ఈ సంఘటన మొత్తాన్ని చిత్రీకరిస్తున్న అబ్బాయిలు కూడా దీనిని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయారు. మన సరదా కోసం మూగ జీవులను హింసించడం ఎలా ప్రమాదంలో పడేస్తుందో చూపిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఒంటెకి దొరికి ఉంటే అక్కడ పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఈ వీడియోను @krishnansh_arora అనే ఖాతా నుంచి Instagramలో షేర్ చేశారు. ఇప్పటివరకు దాదాపు 80 మంది చూశారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
“అనవసరంగా ఒకరిని ఇబ్బంది పెట్టడం వల్ల ఫలితం చూశాం” అని.. నేటి యువతకు ఏది మంచి ఏది చెడు అన్న సృహ తగ్గిపోతుందని కొందరు ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




