- Telugu News Photo Gallery Spiritual photos Mercury Retrograde Ends In Leo: These four Zodiac Signs That Will Benefit The Most From It
సింహరాశిలో ముగిసిన బుధుడి తిరోగమనం.. ఈ 4 రాశుల వారికి అనేక ప్రయోజనాలు
సింహరాశిలో బుధుడి తిరోగమనంలో కొందరు జీవితంలోని వివిధ అంశాలలో కొన్ని అవాంతరాలను ఎదుర్కొని ఉండవచ్చు. ఇప్పుడు తిరోగమనం ముగిసినందున.. జీవితంలో ఏర్పడిన గందరగోళం.. పొగమంచు తొలగి నట్లు త్వరలో తొలగిపోతుంది. విషయాలను స్పష్టంగా చూడగలుగుతారు. బుధుడి తిరోగమనం ముగియడం అన్ని రాశులకు శుభవార్త, అయితే.. నాలుగు రాశులు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ నాలుగు రాశులు ఏమిటి తెలుసుకుందాం..
Updated on: Aug 30, 2025 | 10:49 AM

బుధ గ్రహం కమ్యూనికేషన్, వ్యాపారం, తెలివితేటలు వంటి కొన్ని విషయాలను సూచించే గ్రహం. ఈ గ్రహం తిరోగమనంలోకి ప్రవేశించినప్పుడు కొంత మంది జీవితంలో కొన్ని అపార్థాలను ఎదుర్కొంటారు. కొన్ని పనుల్లో జాప్యం కలిగే అవకాశం ఉంది. దీని ఫలితంగా కొన్ని పనులు అసంపూర్ణంగా మిగిలిపోవచ్చు. అలా ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. సింహరాశిలో బుధుడు తిరోగమనం ముగిసింది. జూలైలో తిరోగమనం ప్రారంభమైంది. ఈ సమయంలో కొందరు జీవితంలోని వివిధ అంశాలలో కొన్ని అవాంతరాలను ఎదుర్కొని ఉండవచ్చు. ఇప్పుడు తిరోగమనం ముగిసినందున.. జీవితంలో ఏర్పడిన గందరగోళం.. పొగమంచు తొలగి నట్లు త్వరలో తొలగిపోతుంది. విషయాలను స్పష్టంగా చూడగలుగుతారు. బుధుడి తిరోగమనం ముగియడం అన్ని రాశులకు శుభవార్త, అయితే.. నాలుగు రాశులు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ నాలుగు రాశులు ఏమిటి తెలుసుకుందాం..

వృషభ రాశి: బుధుడు తిరోగమనంలో ఉన్న సమయంలో వృషభ రాశి వారు ఇల్లు, కుటుంబం, భావోద్వేగాలకు సంబంధించిన విషయాలను ఆత్మపరిశీలన చేసుకుని, ఆలోచించి ఉండాలి. ఇప్పుడు తిరోగమనం ముగిసి బుధుడు ప్రత్యక్షంగా రాశిలో సంచరిస్తున్నందున వృషభ రాశి వారు భావోద్వేగ భద్రత, సొంత బలాన్ని అనుభవించే అవకాశం ఉంది. గందరగోళం తొలగిపోతుంది. చాలా కాలంగా ఆలోచిస్తున్న వారి ప్రణాళికలను ఖరారు చేసుకోగలుగుతారు. భావోద్వేగపరంగా మెరుగైన స్థానంలో ఉంటారు. స్పష్టంగా ఆలోచిస్తారు. సంబంధాల్లో శాంతిని అనుభవించే అవకాశం ఉంది.

సింహ రాశి: బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు సింహరాశి వారు సందేహాలు, గందరగోళం, వారి సంబంధంలో ఒక రకమైన సంక్షోభం, అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ కాలం ముగిసినందున... సింహరాశి వారు మంచి విషయాలను తమ మార్గంలో ఆకర్షించగలుగుతారు. ఆటుపోట్లు చివరకు వారికి అనుకూలంగా మారతాయి. రాబోయే రోజుల్లో వీరికి మంచి అవకాశాలు లభిస్తాయి. తమను తాము మరింత స్వేచ్ఛగా, నిజాయితీగా వ్యక్తీకరించుకోగలుగుతారు. సృజనాత్మకతను ప్రదర్శిస్తారు.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు తమ వృత్తిపరమైన ప్రయాణం చేసే విషయంలో చాలా జాప్యం అయి ఉంటుంది. అంతేకాదు వీరు అసంతృప్తిగా , తమకు అన్యాయం జరిగిందని భావిస్తూ ఉండాలి. అయితే, ఇప్పుడు ఈ రాశికి వారికి సమయం మారుతుంది. బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారికి వారి లక్ష్యాలు, ఆశయాల గురించి ఆలోచించడానికి చాలా సమయం దొరికి ఉండాలి. ఇప్పుడు వీరి మనస్సు, హృదయంలో స్పష్టతతో సవాళ్లను అధిగమించగలుగుతారు. పనిలో పదోన్నతులు, నాయకత్వ బాధ్యతను పొందే అవకాశం ఉంది. ఆఫీసులో మరింత ప్రాధాన్యత అందుకునే అవకాశం ఉంది.

కుంభ రాశి: బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు కుంభ రాశి వారు తమ సంబంధంలో ఒక రకమైన ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. రాజీ చేసుకుని జీవించి ఉంటారు. అంతేకాదు తమ సంబంధంలో సరిహద్దులను ఎలా నిర్ణయించుకోవాలో కూడా ఆలోచించి ఉండవచ్చు. సరే.. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు బుధుడు ప్రత్యక్షంగా కదులుతున్నందున వీరు సవాళ్లను చాలా మెరుగ్గా అధిగమించగలుగుతారు. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల్లో వ్యాపారం, కెరీర్‌లో కూడా విస్తరించుకునే అవకాశాలను పొందుతారు.




