Friday Fast Method: శుక్రవారం ఏ దేవుడిని పూజించాలి.. ఉపవాసం..ప్రయోజనాల గురించి తెలుసుకోండి..

ఆనందం, శ్రేయస్సుకు కారకుడిగా పరిగణించబడే శుక్రుడిని పూజించడానికి శుక్రవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం సంతోషి మాత ఆశీర్వాదాన్ని  పొందాలనుకునే వ్యక్తి శుక్రవారం రోజున పూర్తి నియమ నిబంధనలతో ఉపవాసం పాటించాలి. శుక్రవారపు వైభవ లక్ష్మి వ్రత మహిమ, పూజావిధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

Friday Fast Method: శుక్రవారం ఏ దేవుడిని పూజించాలి.. ఉపవాసం..ప్రయోజనాల గురించి తెలుసుకోండి..
Friday Fast Method
Follow us
Surya Kala

|

Updated on: May 26, 2023 | 11:01 AM

హిందూ మతం ప్రకారం.. వారంలోని ఏడు రోజుల్లో ఒకొక్క రోజు ఒకొక్క ప్రాముఖ్యత ఉంది. ఒకొక్క రోజు ఒకొక్క గ్రహానికి లేదా, దేవతారాధనకు సంబంధం కలిగి ఉంటుంది. హిందూ విశ్వాసం ప్రకారం..  అన్ని కష్టాలను తొలగించి సంతోషాన్ని ఇచ్చే అమ్మవారు సంతోషి అమ్మవారు. ఇంటిని సంపదతో నింపే లక్ష్మీ దేవి, ఆనందం, శ్రేయస్సుకు కారకుడిగా పరిగణించబడే శుక్రుడిని పూజించడానికి శుక్రవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం సంతోషి మాత ఆశీర్వాదాన్ని  పొందాలనుకునే వ్యక్తి శుక్రవారం రోజున పూర్తి నియమ నిబంధనలతో ఉపవాసం పాటించాలి. శుక్రవారపు వైభవ లక్ష్మి వ్రత మహిమ, పూజావిధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

శుక్రుడి కోసం ఉపవాసం

సనాతన సంప్రదాయంలో శుక్ర వారం శుక్ర గ్రహానికి సంబంధం ఉందని విశ్వాసం. శుక్రవారం రోజు శుక్ర దేవుడు పేరు పెట్టారు. ఎవరి జాతకంలో శుక్ర గ్రహానికి సంబంధించిన దోషం ఉంటే.. దానిని తొలగించి, శుభం పొందడానికి..  21 లేదా 31 శుక్రవారం ఉపవాసం ఉండాలి. అంతేకాదు శుక్రుడికి సంబంధించిన పంచదార, బియ్యం, తెల్లని వస్త్రాలు మొదలైన వాటిని శుక్రవారం దానం చేయాలి.

ఇవి కూడా చదవండి

సంతోషిమాత అనుగ్రహం కోసం ఉపవాసం

హిందూ విశ్వాసం ప్రకారం సంతోషి మాతను విఘ్నాలకధిపతి గణేశుని కుమార్తెగా పరిగణిస్తారు. వీరిని  పూజించడం వల్ల సాధకుడి జీవితంలోని అన్ని రకాల సమస్యలు తొలగిపోయి సంతోషం, శ్రేయస్సు లభిస్తాయి. సంతోషి మాత వ్రతాన్ని 16 శుక్రవారాలు చేయాలనే నియమం ఉంది. అంతేకాదు శుక్రవారం రోజున సంతోషిమాత వ్రతం చేసేవారు పులుపు తినకూడదు. అంతేకాదు సంతోషిమాత వ్రతం చేసే సమయంలో బెల్లం, పప్పును నైవేద్యంగా సమర్పిస్తారు. ఏ మాసమైనా శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం నుండి కూడా ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు. వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన చేస్తేనే పుణ్యఫలం లభిస్తుంది.

వైభవ లక్ష్మి వ్రతం హిందూ విశ్వాసాల ప్రకారం ఆనందం-శ్రేయస్సు, సంపద లభించడానికి ఉత్తమ మార్గం శుక్రవారం వైభవ లక్ష్మిని పూజ చేసి ఉపవాసం చేయాలి. వైభవ లక్ష్మి వ్రతాన్ని వివాహిత స్త్రీలు ఆచరిస్తారు. శుక్లపక్షంలో శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం నుండి 11 లేదా 21 శుక్రవారం వరకు ఆచరించవచ్చు. ఈ వ్రతంలో రోజుకు ఒక్క రోజే భోజనం చేయాలనే నియమం ఉంది.

వైభవ లక్ష్మి వ్రతం దీక్ష పూర్తయిన తర్వాత.. ఉద్యాపన చేయాలి. ఏడుగురు పెళ్లికాని అమ్మాయిలను శుక్రవారం ఇంటికి పిలిచి బియ్యం పాయసం ప్రసాదాన్ని తినడానికి ఇవ్వాలి. వైభవ లక్ష్మి ఉపవాసం కథ పుస్తకాన్ని వారికి ప్రత్యేకంగా బహుమతిగా ఇవ్వాలి. శుక్రవారం నాడు వైభవ లక్ష్మీ దేవి వ్రతం చేయడం వలన పెళ్లికాని యువతలు కోరుకునే వ్యక్తి ని భర్తగా పొందుతారు. సుఖ సంపద, కీర్తిని పొందుతారు. ఈ వ్రతం చేసిన వారి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).