- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti to covert failure into success follow these tips of chanakya in telugu
Chanakya Niti: కష్టంలో కూడా విజయం సాధించాలంటే చాణుక్యుడు చెప్పిన ఈ విధానాలు అనుసరించి చూడండి..
ఒక వ్యక్తి విజయ మార్గంలో ఎటువంటి అవరోధాలు లేదా అడ్డంకులు లేకపోతే ఆ మార్గం సరైనది కాదని అర్థం చేసుకోండి. తన విధానాలలో చాణక్యుడు అలాంటి కొన్ని విషయాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు, వాటిని అనుసరించడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
Updated on: May 26, 2023 | 12:41 PM


పరస్పర గౌరవం: వ్యక్తిగా మీ జీవిత భాగస్వామి పట్ల గౌరవాన్ని పెంపొందించుకోండి. భార్యాభర్తలు తమ ఆలోచనలు, భావాలను గుర్తించడానికి ప్రయత్నించండి. గౌరవంగా చూసుకోండి. జీవిత భాగస్వామిలోని మంచి లక్షణాలను మెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.

మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

ప్రేమ- ఆప్యాయత: పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి. వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి.




