- Telugu News Spiritual Ganesh chaturthi Ganesh Chaturthi 2022: From Sonali Bendre to Keerthy Suresh these clebs welcome ganpati bappa see the photos
Ganesh Chaturthi: సోనాలి బింద్రే నుంచి కీర్తి సురేశ్ వరకు.. సినీ తారల ఇంట గణేశ్ చతుర్థి సంబరాలు.. ఫొటోలు వైరల్
Ganesh Chaturthi 2022: వినాయక చవితి పండుగను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ పండుగను వేడుకగా జరుపుకుంటున్నారు.
Updated on: Aug 31, 2022 | 6:01 PM

వినాయక చవితి పండుగను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ పండుగను వేడుకగా జరుపుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ గణేష్ చతుర్థి సందర్భంగా 'లాల్‌బాగ్ కే రాజా' సందర్శనకు వెళ్లాడు.

బాలీవుడ్ నటి సోనాలి బింద్రే కూడా గణపతి బప్పాకు స్వాగతం పలికింది. ఈ సందర్భంగా సోనాలి బింద్రే ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపింది.

బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ కూడా గణపతి బప్పను ఇంట్లో ప్రతిష్టించారు. భార్య జెనీలియాతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

బాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా గణేశుడిని ప్రతిష్ఠించారు. తన కుటుంబంతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.

కీర్తి సురేశ్ తన ఫ్యాన్స్‌కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది. తన ఇంట్లో ప్రతిష్ఠించిన గణేశుడిని ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.




