Ayodhya Temple: రామమందిరం నిర్మాణంలో కీలకఘట్టం.. 48 లేయర్స్‌తో పునాది నిర్మాణం

అయోధ్యలో దివ్యరామమందిరం నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయ తొలిదశ నిర్మాణం పూర్తయినట్టు అయోధ్య ట్రస్ట్‌ కీలక ప్రకటన

Ayodhya Temple: రామమందిరం నిర్మాణంలో కీలకఘట్టం.. 48 లేయర్స్‌తో పునాది నిర్మాణం
Ram Mandir
Follow us

|

Updated on: Sep 17, 2021 | 5:28 PM

Ram Mandir: అయోధ్యలో దివ్యరామమందిరం నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయ తొలిదశ నిర్మాణం పూర్తయినట్టు అయోధ్య ట్రస్ట్‌ కీలక ప్రకటన చేసింది. 2024 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు. దీంతో అయోధ్య నగరిలో రామమందిరం నిర్మాణంలో కీలకఘట్టం ఆవిష్కృతమైనట్లైంది. రామమందిరం నిర్మాణం తొలిదశ పనులు పూర్తయినట్టు రామ జన్మభూమి ట్రస్ట్‌ వెల్లడించింది. 48 లేయర్స్‌తో పునాది నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు ట్రస్ట్‌ ప్రతినిధులు వెల్లడించారు.

ఎలాంటి విపత్తులు వచ్చినప్పటికి తట్టుకునేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు చంపత్ రాయ్ తెలిపారు. గర్భగుడి నిర్మాణం అవుతున్న చోట 14 మీటర్ల వరకు భూమి లోపల పునాది నిర్మాణం జరిగింది. మిగతా చోట 12 మీటర్ల ఎత్తులో పునాది నిర్మాణాన్ని పూర్తి చేశారు. వివిధ రకాల కాంక్రీట్‌తో పునాది నిర్మాణం జరిగింది.

రామమందిర పునాది నిర్మాణానికి 40 అడుగుల మేర భూమిని తవ్వారు. రెండో దశ ఆలయనిర్మాణం రానున్న రెండు నెలల్లో పూర్తవుతుందని చంపత్‌రాయ్‌ తెలిపారు. మూడో దశ నిర్మాణానికి మరో మూడు నెలలు పట్టే అవకాశముందన్నారు. 2023 డిసెంబర్‌ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. 2024 నాటికి భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తామని ట్రస్ట్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఇటుకలు , స్టీల్‌ను వినియోగించకుండా రాజస్థాన్‌కు చెందిన పాలరాతితో ఆలయ నిర్మాణం జరుగుతోంది.

అయోధ్యలో గత ఏడాది ఆగస్ట్‌ 5వ తేదీన భూమి పూజ జరిగింది. ప్రధాని మోదీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఆలయనిర్మాణం జరుగుతోంది. మూడంతస్తుల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

Read also: PM Modi: 71 కేజీల భారీ కేక్‌.. 71 కేజీల లడ్డూ. 71 ఏళ్ల పీఎం మోదీ బర్త్ డే స్పెషల్స్