- Telugu News India News PM Modi's birthday: BJP workers cut 71 feet long syringe shaped cake in MP Laddu in Uttar Pradesh
PM Modi: 71 కేజీల భారీ కేక్.. 71 కేజీల లడ్డూ. 71 ఏళ్ల పీఎం మోదీ బర్త్ డే స్పెషల్స్
Modi Birthday Celebrations: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు బీజేపీ శ్రేణులు. దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. మోదీ బర్త్‌డే సందర్భంగా కోటిన్నర డోసుల టీకాలందించాలన్న లక్ష్యంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది బీజేపీ.
Updated on: Sep 17, 2021 | 4:39 PM

మోదీ పుట్టిన రోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహించారు. బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తాడేపల్లిలోని తన నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 71 అడుగుల భారీ కేక్‌ను కట్ చేశారు కాషాయపార్టీ కార్యకర్తలు. ఇక వారణాసిలో 71 కిలోల లడ్డూను తయారు చేయించారు. దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ రాజ్‌భవన్‌లో మొక్కలు నాటారు.

ఒడిశాకు చెందిన ఓ యువతి ఆహార ధాన్యాలతో 8 అడుగుల పొడవు ఉన్న ప్రధాని మోదీ ఆకృతిని రూపొందించింది. మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అంకితమిస్తున్నట్లు తెలిపింది. భారత్.. వ్యవసాయాధారిత దేశం కావడంతో.. ఈ చిత్రాన్ని ధాన్యాలతో తయారు చేసినట్లు వెల్లడించింది. ఇది ఒడిశా సంప్రదాయ కళ అయిన పట్టచిత్రను ప్రతిబింబిస్తుందని తెలిపింది. మరోవైపు పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

ఇక ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూపూరీ బీచ్‌లో సైకత శిల్పాన్ని రూపొందించారు.





























