Dussehra 2024: రావణుడి స్వస్థలం శ్రీలంకలో సీతా దేవి ఆలయాలు.. దసరాకు పోటెత్తే భక్తులు
శ్రీలంకలో దసరా పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. శ్రీలంకలో అనేక సీతాదేవి ఆలయాలున్నాయి. ఈ ఆలయాల వద్దకు దసరా రోజున భారీ సంఖ్యలో జనం చేరుకుంటారు. దసరా రోజున శ్రీలంక సందర్శించడం మంచి అనుభూతిని ఇస్తుంది. భారతదేశంలో దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మలు దహనం చేస్తారు. అంటే శ్రీలంకలో దసరా రోజున అక్కడ ప్రజలు ఏమి చేస్తారు? పొరుగు దేశంలో దసరా ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం..
దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో ఈ రోజు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున రాముడు లంక రాజు రావణుడిని సంహరించాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా దసరా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున రావణుడితో పాటు మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తారు. అయితే దసరా వేడుకలు భారతదేశంలోనే కాకుండా రావణుడి స్వస్థలమైన శ్రీలంకలో కూడా జరుపుకుంటారు.
శ్రీలంకలో దసరా పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. శ్రీలంకలో అనేక సీతాదేవి ఆలయాలున్నాయి. ఈ ఆలయాల వద్దకు దసరా రోజున భారీ సంఖ్యలో జనం చేరుకుంటారు. దసరా రోజున శ్రీలంక సందర్శించడం మంచి అనుభూతిని ఇస్తుంది. భారతదేశంలో దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మలు దహనం చేస్తారు. అంటే శ్రీలంకలో దసరా రోజున అక్కడ ప్రజలు ఏమి చేస్తారు? పొరుగు దేశంలో దసరా ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం..
దసరా ఎలా జరుపుకుంటారు
భారతదేశం వలె శ్రీలంకలో కూడా దసరా చాలా వైభవంగా జరుపుకుంటారు. ప్రజలు ఒకరినొకరు కలుసుకుంటారు. దేవుడిని పూజిస్తారు. భక్తి పాటలు వింటూ బహుమతులు మార్చుకుంటారు. అయితే దసరా రోజున శ్రీలంకలో రావణ దహనం చేయరు. శ్రీలంకలో ప్రజలు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బదులుగా మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజలు ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు.
ఎక్కడ జరుపుకుంటారంటే
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం: శ్రీలంకలో రామభక్తుడైన హనుమంతుని ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కొలంబో నుండి 45 నిమిషాల దూరంలో ఉంది. ఇక్కడ మీరు పంచముఖి హనుమంతుని విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. దసరా రోజున కూడా ఈ ప్రదేశం రద్దీగా ఉంటుంది.
సీతా అమ్మన్ ఆలయం: రావణుడు సీతదేవిని ఉంచిన ప్రదేశం ఇదే. ఈ ఆలయ చరిత్ర సుమారు 5000 సంవత్సరాల నాటిదని నమ్మకం. సీత అమ్మన్ ఆలయం నువారా ఎలియా నుండి కేవలం 5 కి.మీ దూరంలో ఉంది .
దివురుంపోల ఆలయం: ఈ ఆలయం ప్రస్తావన హిందూ పురాణాల్లో ఉంది. సీత అగ్ని పరీక్షకు గురైన ప్రదేశంగా విశిష్ట స్థానం ఉంది. ఇక్కడ కూడా దసరాను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయం సీతా ఎలియా నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే సీతామాత అగ్నిపరీక్ష జరిగిందని ప్రతీతి. సీత దేవిని రావణుడి చెర నుంచి విడిపించిన తర్వాత సీత దేవి అగ్ని గుండంలో దూకి తన స్వచ్ఛతను నిరూపించుకుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి