- Telugu News Photo Gallery Winter travel: Best winter destinations to visit in india like auli tawang spiti valley dalhousie, know the details
Travel India: దేశంలోని ఈ ప్రదేశాలు చల్లగా అందంగా మారతాయి.. శీతాకాలంలో సందర్శించడానికి బెస్ట్ ప్లేసెస్
వేసవిలో ప్రజలు చలి నుంచి ఉపశమనం పొందడానికి పచ్చదనంతో నిండిన ప్రదేశం కోసం చూస్తారు. అయితే చలికాలం ప్రారంభం కావడంతో ప్రజలు పచ్చదనంతో పాటు హిమపాతంతో నిండిన అందమైన దృశ్యాలను ఆస్వాదించే ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటారు. అక్టోబర్ లో రాత్రి సమయంలో తేలికపాటి చలి మొదలవుతుంది.. నవంబర్ నెలలో చలి మరింత పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా చాలా చోట్ల హిమపాతం కూడా ప్రారంభమవుతుంది. కొండ ప్రాంతాలు ప్రతి సీజన్‌లో హృదయాన్ని ఆకర్షిస్తాయి. ఎందుకంటే చుట్టూ ఉన్న స్వచ్ఛమైన వాతావరణం, శాంతి, ప్రకృతి ఛాయలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ప్రస్తుతం కొన్ని ప్రదేశాలలో చలికాలంలో అందం మరింత పెరుగుతుంది.
Updated on: Oct 12, 2024 | 10:57 AM

ఈ వింటర్ సీజన్‌లో హిమపాతం ఉన్న ప్రదేశాలకు ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే లేదా సీజన్‌లో మొదటి హిమపాతాన్ని ఆస్వాదించాలనుకుంటే ఈ జాబితాలో కొన్ని ప్రదేశాలను చేర్చుకోవచ్చు.స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో గడపవచ్చు కొన్ని రోజుల పాటు విహారయాత్రకు వెళ్లవచ్చు. శీతాకాలంలో సహజ సౌందర్యం మరింతగా పెరిగి . . ఆకర్షించే ప్రదేశాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

వాస్తవానికి కాశ్మీర్‌ను భారతదేశ స్వర్గం అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడ స్థిరపడాలని కోరుకుంటారు. చలికాలంలో కాశ్మీర్‌ను సందర్శించాలనుకుంటే.. ఖచ్చితంగా గుల్మార్గ్‌ను సందర్శించాలి. అంతేకాదు పహల్గామ్ అందాలను చూడడం మరచిపోవద్దు. ఈ ప్రదేశాలు స్కేటింగ్ ప్రియులకు స్వర్గధామం.

తూర్పు హిమాలయాల ప్రాంతాల్లో శీతాకాలంలో తవాంగ్ అందం మరింత పెరుగుతుంది. శీతాకాలం ప్రారంభంలో కూడా ఇక్కడ హిమపాతాన్ని ఆస్వాదించవచ్చు. మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఇక్కడ నిర్మించిన మఠాలను సందర్శించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. తవాంగ్ దీని సహజ సౌందర్యం కారణంగా ఈ ప్రదేశం విశ్రాంతిని కలిగించే ప్రదేశం మాత్రమే కాదు. ఆధ్యాత్మిక శాంతి కోసం వెతుకుతున్నట్లయితే ఇక్కడ సందర్శించడం ఒక మంచి అనుభూతి .

హిమాచల్ ప్రదేశ్ అందాలు అద్భుతంగా ఉంటాయి. ఖచ్చితంగా శీతాకాలంలో డల్హౌసీని సందర్శించాలి. ఇక్కడ, పర్వతాల పచ్చదనం, వాటిపై తేలికపాటి పొగమంచు, చుట్టూ మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు, దేవదారు అడవులు హృదయాన్ని ఆనందపరుస్తాయి .

చలికాలంలో మంచు కురుస్తుంటే ఆస్వాదించాలనుకుంటే ఉత్తరాఖండ్‌లోని ఔలికి వెళ్లవచ్చు. చలికాలం ప్రారంభంలో కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఔలి హిమాలయాల అద్భుతమైన వీక్షణ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఈ ప్రదేశం రోప్‌వేకి కూడా ప్రసిద్ధి చెందింది. ఔలిలో నందా దేవి పర్వతాన్ని కూడా సందర్శించవచ్చు.

హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న స్పితి వ్యాలీ అందాలు శీతాకాలంలో కూడా పెరుగుతాయి. ఇక్కడ మీరు మఠాలను , సరస్సులను సందర్శించవచ్చు. ఇది కాకుండా చలికాలంలో తప్పనిసరిగా చంద్రతాల్‌ని సందర్శించడం మంచి అనుభూతిని ఇస్తుంది. దీనిని మూన్‌లేక్ అని కూడా పిలుస్తారు. ఇది శీతాకాలంలో ఘనీభవిస్తుంది, కాబట్టి అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. చలికాలంలో మంచు కురుస్తుంటే చూస్తూ ఆనందించాలనుకుంటే మన దేశంలోని ఈ ఐదు ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇక్కడ మీరు ప్రకృతి మధ్య విశ్రాంతి సమయాన్ని గడపడమే కాకుండా సాహస కార్యక్రమాలను కూడా చేయవచ్చు.




