AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: కుబేరుడికి తిరుమల శ్రీనివాసుడు రాసిచ్చిన ప్రాంసరీనోటు ఎక్కడ ఉందో తెలుసా..

Tirumala Srinivasudi Appu Patram: భక్తులు తమ తమ స్థాయిని బట్టి నగలు, నగదును శ్రీవారికి హుండీ ద్వారా సమర్పిస్తారు. శ్రీవారి ఖజానాకు బంగారు వెండి కానుకలు కూడా కుప్పలుతెప్పలుగా వస్తూనే ఉన్నాయి. 17 శతాబ్దం ముందు నుంచే శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించినట్లు శ్రీవారి ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ అప్పు పత్రం ఇప్పటికీ ఉంది. ఎక్కడ ఉందో తెలుసా..

Tirumala: కుబేరుడికి తిరుమల శ్రీనివాసుడు రాసిచ్చిన ప్రాంసరీనోటు ఎక్కడ ఉందో తెలుసా..
Tirumala Srinivasudi Appu Patram (2)
Sanjay Kasula
|

Updated on: Jun 11, 2023 | 11:33 AM

Share

తిరుమల, జూన్ 11: ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అన్న సామెత మనుషులకే కాదు దేవుడికి తప్పలేదు. తిరుమల కలియుగ ప్రత్యక్షదైవమైన వెంకటేశ్వరస్వామికి కూడా ఈ అప్పు తిప్పలు తప్పలేదు. ఓవైపు అతిథి మర్యాదలు, మరోవైపు పెళ్ళివాళ్ళ గొంతెమ్మకోర్కెలు వాటికయ్యే ఖర్చులు.. ఎక్కడికక్కడ చిట్టాపద్దులు తేలక ఏంచెయ్యాలో తెలీక తలపట్టుకొనే పరిస్థితి ప్రతి ఇంటా అనుభవమే కనిపిస్తుంది. కానీ మన ఇతిహాసాల్లో పెళ్లిచేసుకోవడానికి అప్పుచేసిన మగపెళ్లివారు కూడా ఉన్నారు. ఆయన రాసిచ్చిన ఇత్తడి ప్రమాణమూ అది సత్యమనేందుకు ఆధారంగా ఇప్పటికీ ఉంది. అది ఎక్కడ ఉందో ఓ సారి చూద్దాం..

శ్రీనివాసుడు చేసిన అప్పు కారణం కూడా ఉంది. ఆడపెళ్ళివారు ఆగర్భ శ్రీమంతులు. ఆకాశరాజుతో వియ్యమంటే మాటలు కాదుకదా.. కానీ , డబ్బుదగ్గర కొచ్చేసరికి, ఎక్కడైనా రాజేగానీ, రూపాయిదగ్గర కాదన్నది అమ్మవారి మాట. అందులోనూ వివాహంకు వస్తున్నవారు తక్కువ వారు కాదు. దేవాది దేవుడు, ఆదిదేవుడు, బ్రహ్మదేవుడూ, వారి భార్యలు , పరివారజనాలు , ఋషులు అందరూ శ్రీనివాసుణ్ణి కల్యాణమూర్తిగా చూడాలని తిరుమల కొండకు విచ్చేశారు. వివాహానికి వచ్చేవారికి భోజనాలు పెట్టాలి. కాసులు ఏర్పాటు చేయాలి. ఏంచేయ్యాలా అని మదనపడుతున్న శ్రీనివాసుణ్ణి పక్కకి పిలిచి, ఆదివరాహ స్వామి క్షేత్రంలో రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు శివయ్య.. అప్పుడు పరమ శివుడు మనదగ్గర డబ్బులేకపోయినా ఫరవాలేదు కానీ , నాకు బాగా డబ్బుకల స్నేహితుడు ఉన్నాడు అప్పు చెయ్యవయ్యా అని ఆ పరమ శివుడే సలహా ఇచ్చారట.

ఆయన సలహాతో శ్రీనివాసుడు రాహ స్వామి క్షేత్రంలో రావి చెట్టు కింద నిలుచుని కుబేరుడిని చాలా రహస్యంగా డబ్బు కావాలని అడిగాడట. ఏమి అనుకోకండి ఓ కాగితం రాసివ్వండి అని కుబేరు అడిగాడట. దీంతో నూటికి పది చొప్పుడు వడ్డి కడుతాను మీ అప్పు తీర్చుతాను. అందులో బ్రహ్మంగారు, రావి చెట్టు సాక్షిగా సంతకాలు చేసిన ఆ పత్రం ఇప్పుడు ఆదివరాహ స్వామి పీఠం కింద ఉండిపోయింది. అదే ఈ మధ్య ఆ పత్రంలోను మ్యూజియంలో పెట్టారట.

శ్రీవానివాసుడు తీసుకున్న అప్పు ఎంతంటే..

స్థల పురాణం ప్రకారం, శ్రీనివాసుడు పద్మావతితో వివాహాఖర్చులకు కుబేరుడు నుంచి 1 కోటి 14 లక్షల బంగారు నాణాలను అప్పుగా పొంది.. దేవ శిల్పి విశ్వకర్మను శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని కోరతాడు. ఆ అప్పు తన భక్తుల సమర్పించే వాటితో చెల్లించుతానని చెప్తాడు. భక్తులు హూండీలో వేసే ధనం, విలువైన ఆభరణాలు రోజుకి 2.25 కోట్ల రూపాయలవరకు ఉండడవచ్చు అని ఓ లెక్క ఉంది.

అప్పుడు చెల్లిస్తున్న భక్త జనం..

కలియుగ ప్రత్యక్షదైవంగా వెంకటేశ్వరస్వామిని కొలుస్తారు భక్తులు.. దేవ దేవుని లిప్తపాటు దర్శనం కోసం.. ఏడుకొండలకు నిత్యం భక్త కోటి తరలివచ్చి తరిస్తారు. ఇప్పుడు మంచుకొండల్లోనూ గోవింద నామస్మరణాలు మారుమ్రోగనున్నాయి. తిరుమల శ్రీనివాసుడి హుండీ నిత్యం కానుకలతో కళకళలాడుతుంది. శ్రీమంతుల నుంచి సామాన్యుడి దాకా తమ స్థాయిని బట్టి రకరకాల కానుకలను శ్రీవారికి భక్తులు సమర్పిస్తారు. ఈ హుండీనే కొప్పెర అని కూడా అంటారు. శ్రీనివాసుడికి ఆయన మామగారు ఆకాశరాజు నుంచి వచ్చిన కానుకల నుంచి నేటి భక్తులు సమర్పించే కానుకల దాకా అన్నీ హుండీ లోనే సమర్పిస్తారు.

భక్తులు సమర్పించే నగలు, నగదు ఆ గంగాళంలోనే..

భక్తులు తమ తమ స్థాయిని బట్టి నగలు, నగదును శ్రీవారికి హుండీ ద్వారా సమర్పిస్తారు. శ్రీవారి ఖజానాకు బంగారు వెండి కానుకలు కూడా కుప్పలుతెప్పలుగా వస్తూనే ఉన్నాయి. 17 శతాబ్దం ముందు నుంచే శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించినట్లు శ్రీవారి ఆలయ చరిత్ర చెబుతోంది. శ్వేత వస్త్రంతో కూడిన గంగాళాన్ని భక్తులు హుండీగా పిలుస్తారు. హుండీ ద్వారా స్వామివారికి రోజుకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. శ్రీవారి హుండీ ఆదాయం.. ఎప్పటికప్పుడు రికార్డులను బద్దలు కొడుతోంది. బంగారం, వెండి ఆభరణాలతోపాటు స్థిరాస్తుల దస్తావేజులు, వస్త్రాలు, నిలువుదోపిడీలు, బియ్యం లాంటి వస్తువులను కూడా భక్తులు కానుకలుగా హుండీలో సమర్పిస్తారు.

శ్రీవారి కొప్పెర లేదా హుండీగా పరిగణించే గంగాళం కానుకలతో నిండిన తర్వాత లెక్కింపు కోసం పరకామణికి చేర్చుతారు. ఈ గంగాళాలను విజిలెన్స్, ఆలయ అధికారులు, బొక్కసం సిబ్బంది సమక్షంలో తెరిచి లెక్కిస్తారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 5 కోట్ల రూపాయల దాకా హుండీ ఆదాయం సమకూరుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం