AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Dev: ఏలినాటి శని ప్రభావం వల్ల కలిగే మార్పులు ఏంటో తెల్సా? ఎన్ని సంవత్సరాలు కష్టపడాలంటే..

శివం అంటే శుభం, శని అంటే అశుభం. నిజంగా శని అంటే అరిష్ఠమా? శనిని ప్రసన్నం చేసుకోకుంటే ఏలిన నాటి శని రూపంలో జనాన్ని పట్టిపీడిస్తారా?

Shani Dev: ఏలినాటి శని ప్రభావం వల్ల కలిగే మార్పులు ఏంటో తెల్సా? ఎన్ని సంవత్సరాలు కష్టపడాలంటే..
Shani Dev
Ravi Kiran
|

Updated on: Feb 14, 2023 | 9:04 AM

Share

శివం అంటే శుభం, శని అంటే అశుభం. నిజంగా శని అంటే అరిష్ఠమా? శనిని ప్రసన్నం చేసుకోకుంటే ఏలిన నాటి శని రూపంలో జనాన్ని పట్టిపీడిస్తారా? శని జాతకంలోకి ప్రవేశించాడంటే ఇక తిప్పలు తప్పవా? శని పీడను వదిలించుకోవడం మానవ మాత్రులకు సాధ్యమేనా? శని ఎన్ని రూపాల్లో ఉంటాడు? ఎన్ని విధాలుగా మనుషులను పీడిస్తాడు?

జాతకంలో శని దోషం.. ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని..అనే మాటలు మనం తరచు వింటుంటాం. అసలు వీటి అర్థం ఏంటి? వీటివల్ల మనకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? వీటి గురించి భక్తుల నమ్మకాలేంటి? వీటిపై పండితులు ఏమంటున్నారు. జాతక చక్రంలో జన్మ రాశి నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని ఏలినాటి శని అంటారు. శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, మందుల వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి.

జన్మరాశిలో అంటే శని ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలాపనిందలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్శాంతి ఉండకపోవడం, ధనవ్యయం, రుణబాధలు, వృత్తి-ఉద్యోగం-వ్యాపారంలో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది. శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తికాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది.

ఇక జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తుంటే దానిని అర్ధాష్టమ, అష్టమ, శని సంచారం అంటారు. ఇవి కూడా దోషమే అని చెబుతారు. జన్మరాశి నుంచి నాల్గో రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి. స్ధాన చలనం,స్ధిరాస్తి సమస్యలు,వాహన ప్రమాదాలు,తల్లికి అనారోగ్యం ఉంటుందని నమ్ముతారు.

జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.శత్రు బాధలు,ఊహించని నష్టాలు వస్తాయి. శనీశ్వరుడికి పూజలు చేస్తే ఏలిన్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వల్ల వచ్చే బాధలు తొలగుతాయని భక్తుల నమ్మకం.