AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: దీపావళికి మీ తల్లిదండ్రులను, పెద్దలను సంతోషపెట్టడానికి ఈ పద్ధతులను అనుసరించండి, బంధం మరింత దృఢంగా మారుతుంది

ఇంటి పెద్దలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేది అతి తక్కువ. అటువంటి పరిస్థితిలో.. పండుగ సమయంలో ఇంటి పెద్దలను తీసుకొని షాపింగ్ చేయవచ్చు. తమ ప్రియమైన వారితో షాపింగ్ చేయడానికి కూడా ఇష్టపడతారు.

Diwali: దీపావళికి మీ తల్లిదండ్రులను, పెద్దలను సంతోషపెట్టడానికి ఈ పద్ధతులను అనుసరించండి, బంధం మరింత దృఢంగా మారుతుంది
Diwali 2022
Surya Kala
|

Updated on: Oct 15, 2022 | 1:31 PM

Share

దేశవ్యాప్తంగా పండుగల సందడి నెలకొంది. శరన్నవరాత్రుల నుంచే భారతదేశం పండుగల రంగుల్లో తడిసి ముద్దవుతుంది. ఇప్పుడు  దీపావళి పండుగకు ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ పండుగకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు విధులు నిర్వహణ, మరోవైపు పండుగ ఏర్పాటు విషయంలో చాలా బిజీగా ఉంటారు. పండుగ రోజున తమ తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేసే అవకాశం లేదు. పండగ సమయంలో మన తల్లిదండ్రులకు, ఇంట్లోని పెద్దలకు తప్పక ఏదైనా చేయాలి. అయితే ఈ దీపావళికి మీరు ఈ పండుగను మీ తల్లిదండ్రులతో పాటు ఇంటి పెద్దల కోసం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లు గురించి తెలుసుకుందాం..

షాపింగ్ కొనసాగించండి ఇంటి పెద్దలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేది అతి తక్కువ. అటువంటి పరిస్థితిలో.. పండుగ సమయంలో ఇంటి పెద్దలను తీసుకొని షాపింగ్ చేయవచ్చు. తమ ప్రియమైన వారితో షాపింగ్ చేయడానికి కూడా ఇష్టపడతారు. అంతే కాకుండా తమకు నచ్చిన వస్తువులను  కొనుగోలు చేకుంటారు.

కొత్త బట్టలు కొనండి ఈ పండుగ రోజున మీ తల్లిదండ్రులకు, పెద్దలకు మరింత ప్రత్యేకం అనిపించేలా కొత్త బట్టలు బహుమతిగా ఇవ్వవచ్చు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరిస్తారు. కనుక మీ ఇంటిలో పెద్దవారు.. కూడా నూతన దుస్తులు ధరిస్తే.. ఆ ఇంటికే సరికొత్త అందం వస్తుంది. మీరు మీ పెద్దవారిని షాపింగ్ కు తీసుకుని వెళ్లి.. వారికి నచ్చిన బట్టలు కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనం: ఉరుకుల పరుగుల జీవితంలో పండగ సందర్భంగా మనం అందరం.. కుటుంబంతో కలిసి భోజనం చేయడం అత్యంత సంతోషకరమైన సంఘటన. అందుకే పండగ రోజున ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి రాత్రి భోజనం చేయండి. బిజీ పనుల వల్ల ఇంటి పెద్దలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నా సరే.. మీరు కుటుంబంతో కలిసి రాత్రి భోజనానికి వెళ్లవచ్చు.

ఆటలు సాన్నిహిత్యాన్ని పెంచుతాయి మీకు కావాలంటే, మీరు లూడో లేదా చెస్ వంటి ఆటలను కూడా హాయిగా ఆడవచ్చు. పండుగ రోజున మీకు గడపడానికి చాలా సమయం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీ కుటుంబంతో పూర్తి సమయం గడపడానికి ప్రయత్నించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)