AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2024: దేశం అంతా దీపావళికి దీపాల కాంతులతో నిండి ఉన్నా.. ఏపీలో ఆ గ్రామంలో గత 200 ఏళ్లుగా జరుపుకోరట.. ఎందుకంటే..

దేశమంతా వెలుగులు విరజిమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామం అంధకారంలో మగ్గుతుంది. ఆ గ్రామంలో దీపాల కాంతులు ఉండవు, టపాసుల శబ్దాలు వినబడవు. ఆ గ్రామం గత 200 ఏళ్లుగా జరుపుకోరట. ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెంలో గత రెండు వందల ఏళ్లుగా దీపావళి పండగను జరుపుకోరు. గ్రామంలో అందరూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే వివాహానంతరం ఈ గ్రామానికి వచ్చిన మహిళలు కూడా ఈ నియమాన్ని పాటించాల్సిందే.

Diwali 2024: దేశం అంతా దీపావళికి దీపాల కాంతులతో నిండి ఉన్నా.. ఏపీలో ఆ గ్రామంలో గత 200 ఏళ్లుగా జరుపుకోరట.. ఎందుకంటే..
Diwali Festival 2024
Surya Kala
|

Updated on: Oct 15, 2024 | 7:49 PM

Share

దేశ వ్యాప్తంగా దీపావళి రోజున అమావాస్య రోజున కూడా వెలుగులు వెదజల్లుతూ బాణాసంచా కాల్పులతో సందడిగా ఉంటుంది. హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే ఈ దీపావళి పండగను కేరళ, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు జరుపుకోవన్న సంగతి తెలిసిందే.. అంతేకాదు దేశమంతా వెలుగులు విరజిమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామం అంధకారంలో మగ్గుతుంది. ఆ గ్రామంలో దీపాల కాంతులు ఉండవు, టపాసుల శబ్దాలు వినబడవు. ఆ గ్రామం గత 200 ఏళ్లుగా జరుపుకోరట. వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెంలో గత రెండు వందల ఏళ్లుగా దీపావళి పండగను జరుపుకోరు. గ్రామంలో అందరూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే వివాహానంతరం ఈ గ్రామానికి వచ్చిన మహిళలు కూడా ఈ నియమాన్ని పాటించాల్సిందే. దీపావళి జరుపుకోరు. ఇలాంటి నిబంధనలు చాలా ఏళ్లుగా గ్రామంలో మహిళలు పాటిస్తున్నారు. అయితే ఈ గ్రామంలోని ఆడపిల్లలు వేరే ఊరిలో వ్యక్తులను పెళ్లి చేసుకుంటే మాత్రం దీపావళి జరుపుకోవడానికి మాత్రమే అనుమతి లభిస్తుంది.

వాస్తవానికి 200 సంవత్సరాల క్రితం పున్ననపాలెం గ్రామ ప్రజలు దీపావళి పండుగను జరుపుకునేవారు. ఇంటింటికీ దీపాలు వెలిగించారు. దీపావళి పండగను జరుపుకునేవారు. అంతేకాదు దీపావళి తర్వాత నాగుల చబితి పండగను కూడా ఘనంగా జరుపుకున్నారు. పుట్టలో పాలు పోసి పాములను పూజించేవారు. అయితే అలాంటి దీపావళి రోజున ఓ చిన్నారి పాముకాటుకు గురై రెండు ఆవులతో సహా మరణించింది. అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకోవడం నిషేధించబడింది. ఆ గ్రామంలో అప్పటి నుంచి దీపావళి కానీ, నాగుల చవితి కానీ జరుపుకోవడం లేదు.

ఇవి కూడా చదవండి

కాలక్రమేణా సంస్కరణల ప్రభావం పెరిగింది. ఆ గ్రామంలోని చదువుకున్న పిల్లలు ఆ సంప్రదాయాన్ని చాలాసార్లు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. మూఢనమ్మకాలు అంటూ ఊరి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించారు. ఇవి నిజానికి గుడ్డి నమ్మకాలు అంటూ చెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఆ ఆచారాన్ని గ్రామస్తులు ఉల్లంఘించడానికి అంగీకరించలేదు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం దీపావళి పండుగను ఆచారాన్ని ఉల్లంఘించి దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాల తర్వాత అతని బిడ్డ అనారోగ్యంతో మరణించాడు. దీంతో దీపావళి జరుపుకునే ఆచారాన్ని ఉల్లంఘించడం వల్లే తన బిడ్డ చనిపోయాడని గ్రామంలో మళ్లీ వార్త వ్యాపించింది. ఈ ఘటన తర్వాత దీపావళి పండగ జరుపుకునే విషయంలో నిబంధన మరింత కఠినంగా చేశారు గ్రామస్తులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)