Viral Video: విదేశీ యువతి చెవి రింగులు చూసిన వృద్ధురాలు.. వాటిని తీయ్యమంది.. ఎందుకంటే

వైరల్ అవుతున్న ఈ వీడియో సాంస్కృతిక మార్పు, మానవ సున్నితత్వానికి ఒక అందమైన ఉదాహరణ. ఇందులో గ్రామంలో ఇంకా ఉన్న మంచితనం, మానవత్వం, వృద్ధుల చూపించే శ్రద్ధకు ప్రతి రూపంగా మారింది. అది విదేశీయులైనా లేదా తమ సొంత వారైనా సరే మన పల్లెల్లో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపిస్తారు. ఈ నేపధ్యంలో విదేశీయువతి ధరించిన చెవిపోగులు చాలా బరువైనవని .. అవి చెవులకు హాని కలిగిస్తాయని ఆ వృద్ధురాలు ఆందోళన చెందింది.

Viral Video: విదేశీ యువతి చెవి రింగులు చూసిన వృద్ధురాలు.. వాటిని తీయ్యమంది.. ఎందుకంటే
Viral VideoImage Credit source: Instagram/@saloni_abraham
Follow us
Surya Kala

|

Updated on: Oct 15, 2024 | 3:55 PM

మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఓ విదేశీ యువతి తిరుగుతుండగా.. ఆమె ఊహించని సంఘటన జరిగింది. ఒక వృద్ధ మహిళ ఆ విదేశీ యువతిని చూసిన వెంటనే.. ఆ యువతి దగ్గరకు వెళ్ళింది. తర్వాత ఆ వృద్ధురాలు ఆ విదేశీ యువతి చెవికి ఉన్న పోగులను తొలగించమని బలవంతం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సలోని అబ్రహం అనే మహిళా టూరిస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇలా ఆ వృద్ధురాలు చేయడం వెనుక అసలు కారణం ఏంటో తెలిస్తే ఆ వృద్ధురాలిని పొగడటం మొదలుపెడతారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో సాంస్కృతిక మార్పు, మానవ సున్నితత్వానికి ఒక అందమైన ఉదాహరణ. ఇందులో గ్రామంలో ఇంకా ఉన్న మంచితనం, మానవత్వం, వృద్ధుల చూపించే శ్రద్ధకు ప్రతి రూపంగా మారింది. అది విదేశీయులైనా లేదా తమ సొంత వారైనా సరే మన పల్లెల్లో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపిస్తారు. ఈ నేపధ్యంలో విదేశీయువతి ధరించిన చెవిపోగులు చాలా బరువైనవని .. అవి చెవులకు హాని కలిగిస్తాయని ఆ వృద్ధురాలు ఆందోళన చెందింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో ఓ విదేశీ యువతి బరువైన చెవిపోగులను ధరించి ఉంది. వాటిని చూసిన వృద్ధురాలు వెంటనే చెవుల నుంచి తీసేయమని చెప్పడం వీడియోలో చూడవచ్చు. ఆ వృద్దురాలు చెప్పిన మాటకు విలువ ఇచ్చి విదేశీ యువతి కూడా తన చెవిపోగులు తీసివేసి వృద్ధురాలి మాటకు విలువ ఇచ్చింది. అయితే విదేశీ యువత తన చెవి పోగులు ఆ వృద్ధురాలికి అవసరం ఏమో అని భావించింది. అందుకనే ఆ విదేశీ మహిళ చెవిపోగులను వృద్ధురాలికి ఇచ్చింది. అయితే ఆ వృద్ధురాలు ఆ చెవి పోగులను తీసుకోవడానికి నిరాకరించింది. దీని తరువాత ఆ వృద్ధురాలు తన చెవులను చూపిస్తుంది. భారీ చెవిపోగులు ధరించడం వల్ల తన చెవులు ఎలా విడిపోయాయో ఆ విదేశీ యువతికి వివరిస్తుంది. దీని తర్వాత అందరూ నవ్వడం మొదలుపెట్టారు.

ఇక్కడ వీడియో చూడండి

‘ఇది భారతీయ సంస్కృతికి అందం’

@saloni_abraham Insta ఖాతా నుంచి షేర్ చేయబడిన ఈ వీడియో ప్రజల హృదయాలను తాకింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇది ఒక వృద్ధ మహిళ ప్రేమను చూపించే మార్గం అని ఒకరు వ్యాఖ్యానించారు. బరువైన చెవిపోగులు ఆ విదేశీయువతి చెవులను కూడా పాడు చేస్తాయని ఆందోళన చెందాడు. మరొకరు మాట్లాడుతూ భారీ చెవిపోగులు చెవులకు హాని కలిగిస్తాయని ఆమె చెప్పదలుచుకుంది. మరొకరు ఇది భారతీయ సంస్కృతిలోని అందం అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..