Dhanurmasa Special: నేడు ధనుర్మాసం 27 వ రోజు.. కృష్ణుడితో కలిసి పాల అన్నం తినాలని కోరుతున్న గోదాదేవి..
Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఇరవైఏడవ రోజు. అమ్మాళ్ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై..
Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఇరవైఏడవ రోజు. అమ్మాళ్ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై అని అంటారు. ఈ రోజు తిరుప్పావై 27వ పాశురం. ఈ పాశురాల్లో 20వ పాశురం నుంచి 29వ పాశురం వరకూ గోదాదేవి శ్రీకృష్ణ భగవానుడిని వర్ణిస్తుంది. నేడు 27 వ పాశురంలో శ్రీకృష్ణుడు తో కలిసి పాలు, అన్నం మునిగేలా నెయ్యి పోసి.. ఆ మధుర పాల పదార్ధం మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కుర్చుని చల్లగా హాయిగా భుజించ వలెను అని గోదాదేవి.. 27 వ పాశురంలో కోరుతుంది. ఈరోజు ధనుర్మాసంలో 27వ పాశురము, దాని అర్ధం తెలుసుకుందాం..
27.పాశురము
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్ నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే, పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్, ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్
అర్ధం:
శత్రువులను జయించే కళ్యాణ గుణ సంపన్న గోవిందా నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పర అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానం లోకులందరూ పొగడెడి తీరుతో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చేడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందియలు, గజ్జెలు మొదలగు అనేక ఆభరణాలు మేము ధరించవలెను. తర్వాత మంచి వస్త్రాలు ధరించవలెను. పాలు, అన్నం మునిగేలా నెయ్యి పోసి.. ఆ మధుర పాల పదార్ధం మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కుర్చుని చల్లగా హాయిగా భుజించ వలెను అని గోదాదేవి.. రంగనాధుడిని తన చెలులు గోపికలతో కలిసి కోరింది.
Also Read: