Dhanurmasa: నేడు తిరుప్పావైలో ఏడవ రోజు.. ప్రకృతి వర్ణనతో నేటి నుంచి ఒకొక్క చెలిని నిద్ర లేపుతున్న గోదాదేవి..
ధనుర్మాసంలో నేడు ఏడవరోజు. ఈ ధనుర్మాసం నెల రోజులూ విష్ణువుని స్తుతిస్తూ.. ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను వైష్ణవాలయాల్లో పాడతారు. ఈ పాశురాల్లో ఆరవ పాశురం నుంచి పది..
Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఏడవరోజు. ఈ ధనుర్మాసం నెల రోజులూ విష్ణువుని స్తుతిస్తూ.. ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను వైష్ణవాలయాల్లో పాడతారు. ఈ పాశురాల్లో ఆరవ పాశురం నుంచి పది పాశురాల వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. ఇక్కడను౦డి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి. పక్షుల కిలకిలారావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. ఈరోజు ధనుర్మాసంలో ఆరో రోజు.. ఆరో రోజు పాశురము, దాని అర్ధం తెలుసుకుందాం..
ఏడవ పాశురము
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయి
అర్దం: భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము. “కీశు కీశ్ ఎన్ఱ్” పక్షులు మాట్లాడుతున్నాయి.
“కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో” పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అని బాధతో మట్లాడుతున్నాయి. నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులేకాదు, “ఎంగుం” అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి, అంటూ అండాళ్ తల్లి “ఆనైచ్చాత్తన్” భరద్వాజ పక్షి గురించి చెబుతుంది. ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి.
ఇవి కూడా చదవండి: Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..
Lok Sabha: సభలో మీ ఎంపీ ఏం చేస్తున్నారో చూడాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
Honey for Skin: పట్టులాంటి చర్మం కోసం తేనెను ఉపయోగించండి.. ఎలా వాడాలో తెలుసుకోండి..