Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devi Navratri 2021: అమ్మవారి ఆలయాలకు మూలా నక్షత్ర శోభ.. విజయవాడ, భాసర క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు..

Devi Navratri 2021: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు మూలా నక్షత్రం సందర్భంగా...

Devi Navratri 2021: అమ్మవారి ఆలయాలకు మూలా నక్షత్ర శోభ.. విజయవాడ, భాసర క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు..
Vijayawada
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 12, 2021 | 7:23 AM

Devi Navratri 2021: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు అమ్మవారు. కాగా, దుర్గాదేవి అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. రాత్రి నుండే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్ లో వేచి ఉన్నారు. దర్శనం ప్రారంభం కావడంతో క్యూల్ లైన్‌లో ఉన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో.. క్యూ లైన్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి. ఇదిలాఉంటే.. క్యూలైన్‌లో రాత్రి నుంచి వేచి ఉండటంతో ఓ భక్తురాలు కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే రెస్పాండ్ అయిన ఆలయ సిబ్బంది.. ఆమెకు వైద్య పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నారు.

బాసరలో మూలానక్షత్ర శోభ.. బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మూల నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఉదయం 3 గంటలకే పూజా కార్యక్రమాలు ప్రారంభమవగా.. భక్తులు గోదావరిలో పవిత్ర స్థానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు కాత్యాయిని రూపంలో దర్శనం ఇస్తున్నారు జ్ఞానసరస్వతి దేవి. ఆలయ వేదమూర్తులు ఉదయం 11 గంటలకు మూలా నక్షత్ర సరస్వతి పూజ నిర్వహించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇదిలాఉంటే.. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో ఆలయంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగాణంలోని నాలుగు మండపాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం మూడు క్యూలైన్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Also read:

Coal Crisis: దీపావళికి చీకట్లేనా.. 110 ప్లాంట్లలో బొగ్గు సంక్షోభం.. ఒక్క రోజు నిల్వలేనివి ఎన్నో తెలుసా.. జరగబోయేదేంటి?

చాణక్య నీతి: ఆ 4 విషయాలలో మహిళలు పురుషుల కంటే ముందుంటారు..!

US Plane Crash: ఇళ్ల మధ్య కుప్పకూలిన విమానం.. ఇద్దరు దుర్మరణం.. మరో ఇద్దరికి..