Coal Crisis: దీపావళికి చీకట్లేనా.. 110 ప్లాంట్లలో బొగ్గు సంక్షోభం.. గ్రామాల నుంచి పట్టణాలకు వరకు విద్యుత్ కోతలు.. అసలేం జరుగుతుందో తెలుసా?
Electricity Problem: దేశంలోని అనేక విద్యుత్ కంపెనీలలో బొగ్గు స్టాక్ లేదు. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. అయితే, ఈ సమస్య పై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వాదనలకు మధ్య చాలా తేడా ఉంది.
Coal Crisis: దేశంలోని అనేక విద్యుత్ కంపెనీలలో బొగ్గు స్టాక్ లేదు. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. అయితే, ఈ సమస్య పై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వాదనలకు మధ్య చాలా తేడా ఉంది. అసలు ప్రశ్న ఏమిటంటే.. వచ్చే నెల ప్రారంభంలో దీపావళి పండుగ వస్తోంది. ఇలాంటి పరిస్థితిస్థిలో ఈ ఏడాది దీపావళి చీకట్లలో జరగుతుందానే అను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలోనే కాకుండా చైనా, యూరప్, అమెరికాలో కూడా విద్యుత్ సంక్షోభం ముప్పు పొంచి ఉంది. పైగా ప్రతీ ఏడాది అక్టోబర్ నుంచి విద్యుత్ డిమాండ్ పెరగడం ప్రారంభమవుతుంది. దిగజారుతున్న పరిస్థితుస్థిలపై ఢిల్లీ, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. ఇవి మాత్రమే కాదు కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. దీంతో భారతదేశం విద్యుత్ సంక్షోభం వైపు పయనిస్తోందా? చైనా లాంటి అనేక దేశాలు చీకట్లోకి వెళ్లనున్నాయా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
135లో 110 ప్లాంట్లలో బొగ్గు సంక్షోభం.. అక్టోబర్ 7 న కేంద్ర విద్యుత్ అథారిటీ నివేదిక ప్రకారం, దేశంలోని 135 ప్లాంట్లలో 110 కర్మాగారాలు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. క్లిష్ట పస్థితిస్థికి చేరుకున్నాయి. అలాగే 16 ప్లాంట్లలో ఒక్క రోజు కూడా బొగ్గు నిల్వ లేదని తెలుస్తోంది. అలాగే 30 ప్లాంట్లలో కేవలం ఒక్క రోజు వరకే బొగ్గు మిగిలి ఉందంటం. అదేవిధంగా 18 ప్లాంట్లలో కేవలం 2 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయంట. అంటే, పరిస్థితిస్థి చాలా తీవ్రంగా ఉందని అర్థమవుతోంది. వీటిలో హర్యా నా, మహారాష్ట్రలలోనే 3 ప్లాంట్లు ఉన్నాయంట. అక్కడ స్టాక్ ఒక్క రోజు కూడా లేదంట. అదేవిధంగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, బీహార్‌లో ఒక్కో ప్లాంట్ ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయంట. వీటిల్లో కేవలం ఒక్క రోజే స్టాక్ మిగిలి ఉంది. అదే సమయంలో పశ్చి మ బెంగాల్లోని 2 ప్లాంట్లలో అలాంటి పరిస్థితిస్థి నెలకొంది. దీంతో కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ను చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేయడంతో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ దాడి బోగ్గు సంక్షోభంపై మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈమేరకు మాటలతో దాడి చేస్తోంది. ఈమేరకు కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. దేశంలోని విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు సంక్షోభంపై పలు వార్తలు వింటున్నాం. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకోవాలని ఓ ప్రత్యేక ప్రైవేట్ కంపెనీ ఎదురుచూస్తోంది. దీనిని ఎవరు దర్యా ప్తు చేస్తారు? అంటూ రాసుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవార్జే లా కూడా ట్వీట్ చేశారు. “పెట్రోల్ తర్వా త విద్యుత్ ధరలతో ప్రజల జేబులపై భారం పెంచేందుకు కుట్ర జరుగుతోంది. బొగ్గు సరఫరాలో భారీ కొరత ఏర్పడింది. విద్యుత్ విధానాలను సవరించారు. సవరణ తర్వా త, ఇష‌్టమొచ్చినట్లు యూనిట్లను లెక్కించి సామాన్యులకు ఝలక్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయిందంటూ” రాసుకొచ్చారు. ప్రస్తుతం యూపీలో బొగ్గు కొరత విద్యుత్ సంక్షోభాన్ని పెంచిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు విద్యుత్ కోతలు ఉన్నాయి. 4 నుంచి 5 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. కానీ వాస్తవానికి కోతలు ఇంకా చాల ఎక్కువగానే విధిస్తున్నట్లు తెలుస్తోంది.
యూపీలో ప్రస్తుత డిమాండ్‌తో పోలిస్తే విద్యుత్ సరఫరాలో 3000 నుంచి 4000 వేల మెగావాట్ల కొరత ఉందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ కూడా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శివరాజ్ క్యాబినెట్ ఇంధన మంత్రి ప్రథుమన్ సింగ్ తోమర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. విద్యుత్ సమస్యపై ఆయనను ప్రశ్నిస్తే..చైనాలో బొగ్గు లేదని సమాధానం ఇచ్చారు. దీంతో చైనా కూడా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ కూడా ఇదే పరిస్థితిస్థిని ఎదుర్కొంటుంది. బొగ్గుపై ఆధారపడిన విద్యుత్ పరిశ్రమలే మన దేశంలో ఎక్కువ ఉన్నాయి. మొత్తం 388 GW విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఉన్నాయి. దీనిలో 54% అంటే 208.8 GW విద్యుత్ బొగ్గు ఆధారిత కర్మాగారాల నుంచే ఉత్పత్తి అవుతోంది.
గత సంవత్సరం దేశంలో బొగ్గు నుంచి 1,125.2 టెరావాట్- గంటల విద్యుత్ ఉత్పత్తి చేయబడింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఈ ఏడాది విషయం భిన్నంగా ఉంది. గత రెండు నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా కోలుకుంది. గత 18 నెలల కోవిడ్ ఆంక్షల కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో విద్యుత్ వినియోగం నెలకు 124.2 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2019లో ఈ రెండు నెలల్లో నెలకు 106.6 బిలియన్ల యూనిట్లుగా నమోదైంది. ఈ కాలంలో బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి 2019 లో 61.91 శాతం కాగా, ఈ సంవత్సరం 66.35 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో 2019 తో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో బొగ్గు వినియోగం 18 శాతం పెరిగింది.
యూపీ, బీహార్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర చాలా రోజులుగా విద్యుత్ కోత విధిస్తునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ, బొగ్గు కొరతతో బీహార్‌లో విద్యుత్ కోతలు లేకుండా చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సంక్షోభంపై కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా విద్యుత్ కోతల విషయాన్ని అంగీకరిస్తోంది. ఇప్పటికే పంజాబ్‌లో ఐదు థర్మల్ పవర్ ప్లాంట్లు మూసివేశారు.
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..!