Puri Jagannatha Temple : పూరి జగన్నాథుడికి దేవతా రూపాలతో 4.8 కేజీల బంగారు నగలను సమర్పించిన ఓ భక్తుడు
కరోనా వైరస్ సృష్టించిన అల్లకల్లోలం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. లాక్ డౌన్ సమయంలో దేవాలయాల్లో నిలిపివేసిన భక్తుల దర్శనాలను తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ స్వామి ఆలయ నిర్వాకులు మళ్ళీ ఆలయం తెరిచి కోవిడ్ నిబంధనలను...
Puri Shree Jagannatha Temple : కరోనా వైరస్ సృష్టించిన అల్లకల్లోలం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. లాక్ డౌన్ సమయంలో దేవాలయాల్లో నిలిపివేసిన భక్తుల దర్శనాలను తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ స్వామి ఆలయ నిర్వాకులు మళ్ళీ ఆలయం తెరిచి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులకు దర్శనాలకు అనుమతినిస్తున్నారు. దీంతో భక్తులు భారీ సంఖ్యలో స్వామిని దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఓ భక్తుడు స్వామివారికి బంగారు నగలను కనుకలుగా సమర్పించారు. ఈ నగలు మొత్తం 4 కేజీల బంగారంతో తయారు చేశారు. అంటే వీటి ధర సుమారు రూ. 1,77,00,000 ఉండవచ్చు అని తెలుస్తోంది. ఈ నగలను చూసిన భక్తులు చాలా బాగున్నాయని.. ఎంత సేపు చూసినా చూడాలనిపించేటంత అక్షర్షణీయంగా ఉన్నాయని భక్తులు అంటున్నారు. బంగారు ఆభరణాల్లో మందిరంలోని దేవతల రూపాలు ఉన్నాయి. జోబా, శ్రీముఖ పద్మల రూపాలతో ఆ నగలు చూపరులను ఆకర్షిస్తున్నాయి.
Also Read: