AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2023: ఈ దీపావళికి వాస్తు ప్రకారం మీ ఇంటిని అలంకరించండి, ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది

దీపావళి రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి,  ఆమె ఆశీర్వాదం పొందడానికి దీపావళికి ముందే తమ ఇళ్లను శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. దుమ్ము, ధూళి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని చెబుతారు. సంపదల దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి వాస్తు నియమాలను అనుసరించి ఇంటిని అలంకరించడం చాలా ముఖ్యం. వాస్తును దృష్టిలో ఉంచుకుని ఇంటిని అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని చెబుతారు.

Diwali 2023:  ఈ దీపావళికి వాస్తు ప్రకారం మీ ఇంటిని అలంకరించండి, ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది
Diwali 2023
Surya Kala
|

Updated on: Nov 02, 2023 | 8:49 AM

Share

దీపావళి హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఒకటి. ఈ సంవత్సరం దీపావళి నవంబర్ 12 ఆదివారం జరుపుకోనున్నారు. ఈ రోజున 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత  సీతారాములు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చారని నమ్ముతారు. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి ఈ రోజున జన్మించిందని కూడా నమ్ముతారు. అందువల్ల ఈ రోజున సంపదకు అధిదేవత అయిన లక్ష్మీ దేవిని..  ఇంట్లో వినాయకుడిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి,  ఆమె ఆశీర్వాదం పొందడానికి దీపావళికి ముందే తమ ఇళ్లను శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. దుమ్ము, ధూళి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని చెబుతారు. సంపదల దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి వాస్తు నియమాలను అనుసరించి ఇంటిని అలంకరించడం చాలా ముఖ్యం. వాస్తును దృష్టిలో ఉంచుకుని ఇంటిని అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని చెబుతారు. కాబట్టి దీపావళి నాడు వాస్తు ప్రకారం మీ ఇంటిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాం.

దీపావళికి ముందు ఇంటి నుంచి పడేయాల్సిన వస్తువులు

దీపావళికి ముందు ఇంట్లో పనికిరాని పాత, పనికిరాని వస్తువులన్నింటినీ తొలగించండి. పాతవి పనికి రాని  వస్తువులు, వార్తాపత్రికల కుప్పలు, పగిలిన అద్దాలు, చిరిగిన బట్టలు, చిరిగిన బూట్లు, చెప్పులు, ఇవన్నీ దీపావళికి ముందు ఇంటి నుంచి తీసివేయాలి. ఇంట్లోని పాత వస్తువులు ప్రతికూల శక్తి ప్రసరణను పెంచుతాయని,  కష్టాలు కలిగిస్తాయని నమ్మకం. అలాగే మురికిని పేదరికానికి చిహ్నంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో సంపదల దేవత అయిన లక్ష్మీ దేవి మీ ఇంటికి ఎప్పటికీ రాదు. అందువల్ల దీపావళి రోజున ఇంటిని శుభ్రపరిచే సమయంలో ఈ వస్తువులను తీసివేయడం మంచిది.

ఇంటి మెయిన్ డోర్ ని ఇలా అలంకరించండి

దీపావళి రోజున శుభ్రపరిచే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం పూర్తిగా శుభ్రం చేయండి. మీ మెయిన్ డోర్ శబ్దం చేస్తే ముందుగా దాన్ని మరమ్మతు చేయండి. వాస్తవానికి, తలుపు నుండి వచ్చే ఏ విధమైన శబ్దం శుభసూచకంగా పరిగణించబడదు. దీని తరువాత ప్రధాన ద్వారంపై వెండి స్వస్తిక, లక్ష్మీదేవి పాదాల చిహ్నాన్ని ఉంచండి. అంతే కాకుండా తలుపులకు మామిడి ఆకులను అలంకరించుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషించి దీపావళి రోజున తప్పకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంటి ఈ దిశను శుభ్రం చేయండి

ఇంటి ఈశాన్య మూలను సరిగ్గా శుభ్రం చేయండి. ఇంటికి తూర్పు, ఉత్తర దిక్కులు కలిసే ప్రదేశాన్ని ఇంటికి ఈశాన్య మూల అంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ స్థలం దేవుని స్థానంగా పరిగణించబడుతుంది. అందువల్ల, ఇంటిలోని ఈ ప్రత్యేక స్థలం చక్కగా, శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ స్థలంలో అనవసరమైన వస్తువులను ఉంచకపోవడమే మంచిది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మీపై నిలిచి ఉంటుంది. ఇల్లు కూడా సంపదతో నిండిపోతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.