AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopashtami 2023: గోపాష్టమి రోజున ఆవుని ఎలా పూజించాలి.. కోరిక నెరవేరడానికి ఏ ఆహారాన్ని తినిపించాలంటే..

పవిత్రమైన గోపాష్టమి రోజు. శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు. కృష్ణ పరమాత్మ తన చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తి నందనవనంలో గోపాలురను రక్షించిన రోజు. ఈ గోపాష్టమి రోజున ఉదయం స్నానం చేసి,  ధ్యానం చేసిన తర్వాత గోమాతకు నమస్కరించాలి. అనంతరం ఆవుకు శుభ్రమైన నీటితో స్నానం చేయించాలి. గోమాత నివసించే స్థలాన్ని కూడా శుభ్రం చేయాలి

Gopashtami 2023: గోపాష్టమి రోజున ఆవుని ఎలా పూజించాలి.. కోరిక నెరవేరడానికి ఏ ఆహారాన్ని తినిపించాలంటే..
Gopashtami 2023
Surya Kala
|

Updated on: Oct 30, 2023 | 6:46 PM

Share

హిందూ సనాతన సంప్రదాయంలో గోపాష్టమి పండుగ గోమాతను ఆరాధించడానికి ప్రసిద్ధి చెందింది. కార్తీక మాసంలోని శుక్ల పక్ష అష్టమి రోజున వచ్చే ఈ పండుగ ఈ సంవత్సరం 20 నవంబర్ 2023న వచ్చింది. ‘గో’ అనగా ‘గోమాత’. ‘గోపా’ అనగా ‘గోప బాలుడు’. కార్తిక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని ‘గోపాష్టమి’ గా పిలుస్తారు. హిందూ మతంలో ఆవును గోమాతగా పూజిస్తారు. గోమాత శరీరంలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో గోవును పూజించడం, గోసేవ చేయడం ద్వారా ఎవరైనా గోమాత అనుగ్రహం మాత్రమే కాదు 33 కోట్ల మంది దేవీ దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. గోపాష్టమి రోజున ఆవును, కన్నయ్యను పూజించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో.. ఈ పూజను ఎప్పుడు, ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం.

గోపాష్టమి పూజకు అనుకూలమైన సమయం

గోపాష్టమి పండుగ 20 నవంబర్ 2023 ఉదయం 05:21 గంటలకు ప్రారంభమై 21న తెల్లవారుజామున 03:18 గంటలకు ముగుస్తుంది. కనుక గోపాష్టమి రోజున గోపూజను నవంబర్ 20 న మాత్రమే జరుపుకుంటారు.

గోపాష్టమి నాడు గోవును ఎలా పూజించాలంటే

పవిత్రమైన గోపాష్టమి రోజు. శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు. కృష్ణ పరమాత్మ తన చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తి నందనవనంలో గోపాలురను రక్షించిన రోజు. ఈ గోపాష్టమి రోజున ఉదయం స్నానం చేసి,  ధ్యానం చేసిన తర్వాత గోమాతకు నమస్కరించాలి. అనంతరం ఆవుకు శుభ్రమైన నీటితో స్నానం చేయించాలి. గోమాత నివసించే స్థలాన్ని కూడా శుభ్రం చేయాలి. తరువాత ఆవుకి పూలమాల వేసి, వస్త్రాలను కప్పాలి. పసుపు, కుంకుమ, చందనం మొదలైన వాటితో అలంకరించాలి. దీని తరువాత, ఆవుకు పండ్లు, వంటకాలు, పిండి,  బెల్లం రొట్టెలు మొదలైనవి తినిపించాలి. తర్వాత అగరబత్తీలు, దీపం వెలిగించి ఆవుకి ఆరతిని ఇవ్వాలి. హిందువుల విశ్వాసం ప్రకారం గోపాష్టమి పండుగ నాడు ఆవుతో పాటు, శ్రీకృష్ణుడిని కూడా సంప్రదాయ ప్రకారం పూజించాలి. గోవులకు పశుగ్రాసం, ఆకుపచ్చని బఠాణీలు, గోధుమలు పెడితే  సర్వాభీష్టాలు నెరవేరుతాయి

ఇవి కూడా చదవండి

గోపాష్టమి ఆరాధన.. మతపరమైన ప్రాముఖ్యత

హిందూ విశ్వాసం ప్రకారం గోమాతను పూజించిన వారు ఆనందం, అదృష్టంతో పాటు ఆరోగ్యాన్ని పొందుతాడు. గోమాత నివసించే ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలు స్వయంచాలకంగా తొలగిపోతాయని,  దుష్టశక్తులు ఎప్పటికీ ప్రవేశించవని విశ్వాసం. శ్రీ కృష్ణ భగవానుడు ఆవును చాలా ప్రేమిస్తాడు కనుక గోమాతను పూజించే వ్యక్తిపై అనుగ్రహం కలిగి ఉంటాడని.. ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. హిందూ విశ్వాసం ప్రకారం గోపాష్టమి పండుగ నాడు ఆవు దూడలను కూడా ఆచారాల ప్రకారం పూజించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.