CM KCR – Yadadri: తెలంగాణలో మరో మహాఘట్టం.. ఇవాళ యాదాద్రి వెళ్తున్న సీఎం కేసీఆర్.. పునఃప్రారంభానికి ముహూర్తం..
తెలంగాణలో మరో మహాఘట్టం. యాదాద్రి ఆలయం పునఃప్రారంభానికి ముహూర్తం. ఇవాళ యాదాద్రి వెళ్తున్న సీఎం కేసీఆర్...పునర్నిర్మాణ పనులను పరిశీలించి..డేట్ ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణలో మరో మహాఘట్టం. యాదాద్రి ఆలయం పునఃప్రారంభానికి ముహూర్తం. ఇవాళ యాదాద్రి వెళ్తున్న సీఎం కేసీఆర్…పునర్నిర్మాణ పనులను పరిశీలించి..డేట్ ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం పదకొండున్నర గంటలకు బయల్దేరి వెళ్తారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ఇప్పటికే ముగిశాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అన్నీపనులను మరోసారి పరిశీలిస్తారు. ఆలయంలో ప్రతి భాగాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఇంకేవైనా మార్పులు ఉంటే ఆలయ అధికారులతో జరిగే సమయంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
మరోవైపు భవ్యమైన యాదాద్రి ఆలయ పున:ప్రారంభం తేదీ ముహూర్తాన్నిఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారు. ఈ మధ్య సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన సమయంలో ఈ నిర్ణయం జరిగినట్లు సమాచారం. యాదాద్రిలోనే ఆలయ పున:ప్రారంభం తేదీలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇక ఆలయం పునఃప్రారంభం సందర్భంగా మహా సుదర్శనయాగం నిర్వహించనున్నారు. యాగం కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించారు. మహా సుదర్శనయాగం వివరాలు, తేదీలను కూడా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. మరోవైపు యాదాద్రి ఆలయ పున:ప్రారంభానికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి: Chanakya Niti: Chanakya Niti: ఇలాంటి శత్రువులతో జాగ్రత సుమీ.. అలాంటివారి పట్ల ఏమరపాటు అసలే వద్దు..
Cryptocurrency: బిట్‌కాయిన్ మరింత దూకుడు.. ఈథర్, డాగ్‌కోయిన్‌లో కొత్త జోష్..