Horoscope Today: ఈరాశి వారికి చాలా అనుకూలం.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈరోజు రాశి ఫలాలు..

భవిష్యత్తుపై చాలా మందికి ఆశలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.. వారి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.. ఈ క్రమంలో తమ రోజులో ఏం జరగబోతుంది… ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనేది ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు..

Horoscope Today: ఈరాశి వారికి చాలా అనుకూలం.. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈరోజు రాశి ఫలాలు..
Horoscope

భవిష్యత్తుపై చాలా మందికి ఆశలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.. వారి జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.. ఈ క్రమంలో తమ రోజులో ఏం జరగబోతుంది… ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనేది ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు.. ఈ క్రమంలోనే రోజూ వారీ దినఫలాలు తెలుసుకునేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు… ఈరోజు అక్టోబర్ 18న సోమవారం నాడు చంద్రుడు మీన రాశిలో రోజంతా ఉండనున్నాడు.. అలాగే ఈరోజు తులరాశి వారికి అనుకూలంగ ఉంటుంది. మరి మిగతా రాశుల వారికి ఈరోజు ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందామా..

మేష రాశి..
మీరు ఉన్న రంగాల్లో విజయ పరంపర కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం. అంతా మంచే జరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి..
ఈ రాశివారికి శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.

మిథున రాశి..
వీరు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. గణపతి స్తోత్రం పఠించడం, దైవారాధన చేయడం మంచిది. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు చేస్తారు.

కర్కాటక రాశి..
ఈ రాశివారికి అర్థలాభం ఉంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేయండి. ఆపదలు తొలుగుతాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి.

సింహ రాశి..
ఈరోజు వీరు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఉత్తమం.

కన్య రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే.. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

తుల రాశి..
ఈ రాశివారు ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

వృశ్చిక రాశి..
ఈరోజు ధర్మకార్యాచరణతో లక్ష్యాలను చేరుకుంటారు. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్టదైవారాధన మంచిది.

ధనుస్సు రాశి..
ఈ రాశివారు ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. బుద్ధిబలంతో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు.

మకర రాశి..
ఈరోజు వీరికి మిశ్రమ కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభ రాశి..
ఈ రాశివారు ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి.

మీన రాశి..
ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu